మస్క్ మాములోడు కాదు.. ఇదిగో ఫ్రూఫ్..!

మనం కలలో కూడా ఊహించనవి.. అతను సాధ్యం చేసి చూపిస్తాడు. మనం కల్కి సినిమాలో చూసినవి కళ్ల ముందు కనిపించేలా చేస్తాడు. ఆ బుర్ర పాదరసం కంటే మహా చురుకు.. కానీ అతడి ఆలోచనలు మరింత వేగం.. ఓ 20 ఏళ్లు ముందుకు ఆలోచిస్తారా? అన్నట్లు ఉంటాయి అవి.


అద్భుతమైన ఫీచర్లతో టెస్లా వంటి అంతరిక్షం ప్రయాణానికి కంపెనీని స్థాపించినా.. రూ. 3 లక్షల కోట్లు  పెట్టి ట్విటర్ ను కొనుగోలు చేసినా ఏదైనా సంచలనమే. వీటి సరసన మరో ప్రత్యేకత సాధించారు.


స్పేస్ ఎక్స్ ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ ను నిర్వహించింది. ఈ మేరకు చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు జరిగినవన్నీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన స్పేస్ వాక్ కే. మస్క్ సంస్థ చేపట్టింది మాత్రం అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్.


తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ చేపట్టిన ప్రాజెక్టు పేరు పొలారిస్ డాన్. ఇక్కడ డాన్ అంటే ఇంగ్లిష్ లో సూర్యోదయం అని అర్థం. దీనిని dawn చదువుకోవాలి. ఈ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది స్పేస్ ఎక్స్. ఈ క్రూ డ్రాగన్ క్యాప్యుల్స్ ప్రస్తుతం భూమి చుట్టూ చక్కర్లు కొడుతోంది.


పోలారిస్ డాన్ కింద వెళ్లిన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్  నుంచి జేర్డ్ ఇస్సాక్ మన్, సారా గిల్లి ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి స్పేస్ సూట్ ను పరీక్షించారు. కాగా. వ్యోమగాములు స్పేస్ వాక్ చేసిన మొదటి ప్రైవేట్ మిషన్ ఇదే. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలను వినియోగించడం మరో ప్రత్యేకత. కాగా మస్క్ మరో మూడేళ్లలో ప్రపంచ తొలి ట్రిలియనర్ రూ.85లక్షల కోట్లు గా అవతరించనున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం రూ.3లక్షల కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన మస్క్.. దీనికి ఎక్స్ గా పేరు మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: