కాకరకాయ చేదును పోగొట్టే సింపుల్ చిట్కాలు ఇవే..!

frame కాకరకాయ చేదును పోగొట్టే సింపుల్ చిట్కాలు ఇవే..!

lakhmi saranya
చాలామందికి కాకరకాయ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే చేదుగా ఉండటం వల్ల కాకరకాయను పెద్దగా ఇష్టపడరు. అలా చేదు లేకుండా కాకరకాయ ఉంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చేదు వల్లే కాకరకాయను ఇష్టపడరు. కాకరకాయ చేదును పోగొట్టే సింపుల్ చిట్కా ఏమిటో తెలుసుకుందాం..!కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చేదు కారణంగా చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ ఈ కాకర వండే సమయంలో కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా చేదు లేకుండా ఈ కూరను ఎంజాయ్ చెయొచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. కాకరకాయ ముక్కలను కోసి వాటిని అరగంటసేపు పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టాలి.
తర్వాత ఈ మొక్కల నుంచి రసం పిండేసి పడేయాలి. ఈ ముక్కలతో కూర వండితే చేదు తగ్గుతుంది. కాకరకాయ మీద ఉండే ముదరు ఆకుపచ్చ రంగు భాగాన్ని తీసేయడం మంచిది. పిలర్ లేదా కత్తి ఉపయోగించి ఈ తొక్క తీసేయొచ్చ. దీనివల్ల చేదుతనం తగ్గుతుంది. కాకరకాయను చిన్న ముక్కలుగా కోసి వాటిని కి ఉప్పు, పసుపు కలిపి అరగంటసేపు పక్కన పెట్టేయాలి. తరవాత ఆ మొక్కల నుంచి వచ్చే రసం పిండి పడేయాలి. అంతే ఈ మొక్కలతో కూర వండుకుంటే చేదు తగ్గుతుంది.
 కాకరకాయ ముక్కల మీద ఉప్పు కలిపిన నిమ్మరసం పిండి కాసేపు పక్కన పెట్టాలి. తరువాత వాటి నుంచి రసం పిండేసి మంచి నీళ్లతో కడగాలి. వీటితో కూర వండుకుంటే చేదు ఉండదు. కాకరకాయలోని గింజలు చాలా చేదుగా ఉంటాయి. ఒకవేళ మీరు పూర్తిగా చేదుతనం రాకుండా ఉండాలంటే ఈ గింజలు తీసేసి కూర వండుకోండి. కాకరకాయ చేదును తగ్గించడానికి కూర ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా చక్కెర కలుపుకోండి. లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. వీటిలోని తీయదనం చేదును కాస్త తగ్గిస్తుంది. పోషకాలు అవసరం లేదా చేదు తగ్గితే చాలు అనుకుంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ముందుగానే కాకరకాయ మొక్కలను ఉప్పు కలిపిన నీళ్లలో ఉడికించి పంపండి. వీటితో కూర వండుకుంటే చేదు ఉండదు. కాకరకాయ ముక్కలను కట్ చేసి వాటిని చింతపండు రసంలో కాసేపు నానబెట్టండి. కాసేపు అయ్యాక ఈ మొక్కలతో కూర వండుకుంటే చేదు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: