మధుమేహం ఉన్నవారు పెరుగుని తినవచ్చా..?నిపుణులు ఏం చెప్తున్నారంటే..

frame మధుమేహం ఉన్నవారు పెరుగుని తినవచ్చా..?నిపుణులు ఏం చెప్తున్నారంటే..

lakhmi saranya
చాలామందికి పెరుగు అంటే చాలా ఇష్టం. మరికొంతమందికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. కానీ పెరుగు తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుందా లేదా అనేది తెలుసుకుందాం..ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు కూడా ఎందుకు కారణం అవుతున్నాయి. అయితే మధుమేహం ఉన్నవారు పెరుగు తినవచ్చా..?అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారట. కాగా కొన్ని రకాల హెల్తీప్రడ్స్ ద్వారా కూడా దీనిని నివారించడం, అదుపులో ఉంచుకోవటం సాధ్యం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగు అందుకు సహాయపడుతుందని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రతిరోజు కనీసం రెండు కప్పుల పెరుగు తినటంవల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్రిక్ హల్త్ డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకుల అధ్యయనంలోనూ ఇది వెల్లడైంది. అయితే బాదం, కొబ్బరి పాలు వంటి ఇతర పదార్థాలు కలిపిన పెరుగు కాకుండా, స్వచ్ఛమైన పాలతో తయారైన పెరుగు మాత్రమే ఇటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. పెరుగులో అనేక పోషక గుణాలు ఉంటాయి. కార్బో హైడ్రేట్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటాయి.
కాబట్టి ఇన్సులిన్ సహాయం లేకుండా రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచగలుగుతుందని ఆరోగ్యాన్నిపుణులు చెబుతున్నారు. అందుకే షుగర్ పే షెంట్లు నిస్వందేహంగా పెరుగు తినవచ్చు అంటున్నారు. కాబట్టి పెరుగుని తినడం వల్ల ఎటువంటి సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ పెరుగులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎక్కువగా కూడా తినకూడదు. కానీ పెరుగులో చాలా ఆరోగ్యకర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది తినటం వల్ల వేడి చేసిన మనుషులకు చలవ చేస్తుంది. కాబట్టి పెరుగును మీరు కూడా తప్పకుండా తినండి. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తినండి. ఎందుకంటే దీంట్లో ఏంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని ఎవరైనా కానీ తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: