ఎడమ చేతితో రాసేవారికి ఆ పవర్ ఎక్కువ
ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుంది? వస్తే వారిలో ఏ క్వాలిటీస్ ఉంటాయనేదానిపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఓ పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో ఎడమ చేతి వాటం ఉన్న వారి మెదడు పనితీరు ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తించింది. సాధారణంగా కుడి, ఎడమ చేతి అలవాట్లను నిర్ణయించేది మన మెదడే. సైటో స్కెలిటన్ అనే పదార్థం మన మెదడులో ఉంటుంది. ఆ విషయాన్ని పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. దానిని పరిశోధించగా కుడిచేతి వాటం, ఎడమ చేతి వాటం ఉన్న వారి ఆలోచనల్లో తేడాలున్నట్లు సైంటిస్టులు తెలుసుకున్నారు.
ఎడమ చేతివాటం ఉంటే మెదడులోని ఎడమ భాగాలు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉంటాయని గుర్తించారు. వీరికి కొన్ని పవర్స్ కూడా ఉంటాయని వారు కనుగొన్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారు బాగా మాట్లాడుతారని, స్మార్ట్‌గా ఆలోచిస్తారని సైంటిస్టులు చెెబుతున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారు బాక్సింగ్, టెన్నిస్, బేస్ బాల్ గేమ్స్ బాగా ఆడతారని, వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. ఇంకా ఫొటోగ్రఫీ స్కిల్స్ బాగుంటాయని, వీడియో గేమ్స్ బాగా ఆడతారని, లెక్కలు ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తారని సైంటిస్టులు గుర్తించారు. ఐన్‌స్టీన్, న్యూటన్, మేరీ క్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ వంటివారంతా ఎడమచేతి వాటం ఉన్నవాళ్లేనని చరిత్ర చెబుతోంది.