అసోంలోని ఈ సమాధులు.. యునెస్కోను ఆకర్షించాయి? ప్రత్యేకతలేంటో తెలుసుకోండి?
ఇక అసోంలో దర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అహోం రాజులు 700 ఏళ్ల క్రితం అసోంను పాలించారు. వారి కాలంలో నిర్మించిన మట్టి సమాధులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు. ఇటీవలే వీటిని వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్రం యునెస్కోకు ప్రతిపాదించింది. 2023-24 సంవత్సరానికి గానూ ఈ సమాధులు లను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేరింది.
మొయిడమ్స్ అనేది పిరమిడ్ లాంటి ఆకృతిలో భూగర్భ నిల్వల కోసం నిర్మించిన మట్టి సమాధులు. అసోంను 600 ఏళ్లు పాలించిన తాయ్ –అహోం రాజవంశానికి చెందిన రాజులను ఖననం చేసేందుకు వీటిని నిర్మించారు. రెండంతస్తుల కలిగిన ఈ నిర్మాణంలోనే ప్రవేశించే మార్గం వంపు తిరిగి ఉంటుంది. ఖననం చేసిన వ్యక్తి వాడిన వస్తువులు, నగలు, ఆయుధాలు, దుస్తులు ఈ సమాధుల్లోనే ఉంచేవారు.
అయితే దాదాపు ఇలా 90 మంది రాజులు, రాణులు, ప్రభువులను మరణాంతరం మొయిడమ్స్ లో ఖననం చేశారు. మొయిడమ్ లు తప్పనిసరిగా మట్టి, ఇటుక లేదా రాళ్లతో చేసిన బోలుగా ఉండే ఖజానాలపై నిర్మించిన మట్టి దిబ్బలు. అష్ట భుజి కుహరం మధ్యలో ఒక మందిరం ఉంటుంది. ఈ మొయిడమ్ లను పురతాన చైనా రాజు సమాధులు, ఈజిప్టియన్ల ఫారోల పిరమిడ్లతో పోల్చారు.
అహోం రాజవంశ సమాధులకు యునెస్కో గుర్తింపు దక్కడంతో ఈశాన్యం నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది. కాజిరంగా, మానస్ నేషనల్ పార్కుల తర్వాత అసోం మూడో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కిందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ పోస్టు చేశారు.