ఒంట్లో వేడిని తగ్గించే 5 పండ్లు ఇవే..!

lakhmi saranya
ఎండాకాలంలో ఉండే ఉష్ణోగ్రతలను మన బాడీ ఎదుర్కొని హెల్తీగా ఉండాలంటే తగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా మన బాడీ డిహైడ్రేట్ అయ్యి ఎప్పుడు లాగానే హెల్దీగా ఉంటుంది. ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన 5 ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుచ్చకాయలో 92% మీరే ఉంటుంది. ఇది శరీరాన్ని చల్ల పరచడంలోనే కాకుండా అనేక ప్రయోజనాలను ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఎండాకాలంలో వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకోవాలి.
2. కీర దోసలో నీరు అండ్ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది కూడా శరీరాన్ని కూల్ చేసి వేడిని తగ్గిస్తుంది.
3. పైనాపిల్ పండ్ల లోను అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు కారణంగా ఎండాకాలంలో మన బాడీని డిహైడ్రేషన్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో ఈ ఫ్రూట్ ని తప్పనిసరిగా తినాలి.
4. మన చుట్టుపక్కల దొరికే బొప్పాయిలో కూడా అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి ఒక ఎండాకాలంలోనే కాదు ప్రతి కాలంలో కూడా మన బాడీకి ఉపయోగపడతాయి. కానీ ఎండాకాలంలో మరింత సహాయ పడతాయి. ఈ బొప్పాయాలను ఎండాకాలంలో తీసుకోవడం ద్వారా అనేక విటమిన్లు మన బాడీకి అందుతాయి.
5. బ్లాక్ బెర్రీ లో నీరు అండ్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా శరీరాన్ని వేడి నుంచి కాపాడుతాయి. అందువల్ల ఎండాకాలంలో ఈ బ్లాక్ బెర్రీలను తప్పనిసరిగా తీసుకోవాలి.
పైన చెప్పిన  5 పండ్లను వేసవికాలంలో తీసుకోవడం ద్వారా ముఖ సౌందర్యంతో పాటు బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఎండాకాలంలో ఉండే ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువగా ఫ్రూట్స్ ని తీసుకోవాలి. పైన చెప్పిన ఐదు ఫ్రూట్స్ను కనుక మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే అద్భుతమైన బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: