దోమల బెడదను తగ్గించే సహజ చిట్కాలు?

Purushottham Vinay
దోమల బెడదను తగ్గించడంలో ఇప్పుడే చెప్పే చిట్కాలు చాలా చక్కగా పని చేస్తాయి. ఒక స్ప్రే బాటిల్ నీటిని తీసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రసాన్ని లేదా దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఇంట్లో మూలలకు, ఇంటి బయట చెట్లపై స్ప్రే చేయడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. వీటితో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. కూలర్ లల్లో నీటిని మారుస్తూ ఉండాలి. దోమల బెడద ఎక్కువగా ఉన్న వారుదోమ తెరలను వాడడం మంచిది. అలాగే ఎండిన వేపాకులను సేకరించి వాటిని కాల్చాలి. ఇలా చేయడం వల్ల ఆకుల నుండి వచ్చే పొగ కారణంగా దోమలు పారిపోతాయి. అలాగే దోమకాటుకు గురి కాఉండా ఉండేందుకు వాడే లోషన్లకు బదులుగా సహజ సిద్ద నూనెలను వాడడం మంచిది. నిమ్మగడ్డి నూనె, లవంగం నూనెలను వాడడం వల్ల వీటి నుండి వచ్చే ఘాటైన వాసన కారణంగా దోమలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే ఒక గిన్నెలో 5 బిర్యానీ ఆకులను, ఒక కర్పూరాన్ని, లవంగాలను, 1 లేదా 2 టీ స్పూన్ల ఆవనూనెను వేసి కాల్చాలి.


ఇలా చేయడం వల్ల దీని నుండి వచ్చే పొగ కారణంగా దోమలు ఇంట్లో నుండి వెళ్లిపోతాయి.దోమ కాటు గురి అవ్వడం వల్ల దురద, దద్దుర్లతో పాటు మనం విష జ్వరాల బారిన కూడా పడాల్సి వస్తుంది. అయితే చాలా మంది వీటి నుండి బయటపడడానికి మార్కెట్ లో లభించే కాయిల్స్, స్ప్రేలనువాడుతూ ఉంటారు. వీటి వాడకం అస్సలు మంచిది కాదు. వీటిలో ఉండే రసాయనాల కారణంగా తుమ్ములు, అలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే కొందరు లోషన్లను కూడా వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి జెట్ కాయిల్స్, ఆల్ అవుట్, గుడ్ నైట్ లాంటి కెమికల్స్ తో కూడిన మందులకు బదులుగా దోమలను నివారించే ఈ సహజ పద్దతులను వాడడం చాలా మంచిది.చాలా ఆరోగ్యంగా ఉంటారు.ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం సహజ సిద్దంగా దోమల బెడద నుండి బయటపడవచ్చు. పైగా మనకు ఈ ఈ చిట్కాలను పాటించడం వల్ల  ఎటువంటి హాని కూడా కలగకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి. దోమల బెడద నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: