ఈ సింపుల్ టెక్నిక్.. అధిక బరువుని తగ్గిస్తుంది?

Purushottham Vinay
అధిక బరువున్న వారు సన్నబడాలంటే ఖచ్చితంగా కష్టపడి వ్యాయామాలు చెయ్యాలి. కానీ చాలా సులభమైన సూర్యనమస్కారాలు చేయడం వల్ల పొట్ట, నడుము, తొడలు, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరుగుతుంది. చాలా సులభంగా మనం బరువు తగ్గవచ్చు. అలాగే వీటిని మొదటిసారి చేసే వారు ఒక్కో రోజుకు ఒక్కో సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి. మొదటి నాలుగు లేదా ఐదు రోజులు కొద్దిగా శరీరంలో నొప్పులు వచ్చినప్పటికి ఇవి క్రమంగా మనకు అలవాటైపోతాయి. ఇలా ఒంటి నొప్పులు వచ్చినప్పుడు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ ఇలా సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీర బరువు తగ్గడంతో పాటు శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా సులభంగా కరిగిపోతుంది. ఇతర వ్యాయామాలు చేయలేని వారు ఇలా సూర్యనమస్కారాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.ఇలా వివిధ కారణాల వల్ల వ్యాయామం చేయడం మానేసే వారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సూర్య నమస్కారాలు ఎవరికి వారే చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల నడుము చుట్టూ, పిరుదుల భాగంలో ఉండే కొవ్వు కరిగి అవి చాలా సన్నగా అవుతాయి.


12 భంగిమలను ఒక దాని తరువాత ఒకటి చేయడం వల్ల ఒక సూర్య నమస్కారం అవుతుంది. దీంతో మన ఏకాగ్రత అంతా కూడా దానిపైనే ఉంటుంది. ఎవరు తోడు లేకపోయినా కూడా ఈ సూర్యనమస్కారాలు మనం సులభంగా చేయవచ్చు. అలాగే వీటిని చేయడం వల్ల ఎటువంటి విసుగు కూడా రాదు.నడుము చుట్టూ, పిరుదుల భాగంలో కొవ్వు పేరుకుపోయిన వారు ఆయా భాగాలను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మంది వ్యాయామాలు, ఆసనాలు చేసి విసుగు చెంది మానేస్తూ ఉంటారు. కొందరు ఆశించిన ఫలితాలు రావడం లేదని మానేస్తూ ఉంటారు. కొందరు చేయడానికి తోడు లేదని మానేస్తూ ఉంటారు. ఇలా వివిధ కారణాల వల్ల వ్యాయామం చేయడం మానేసే వారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సూర్య నమస్కారాలు ఎవరికి వారే చేసుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా సింపుల్ గా ఈ సూర్య నమస్కారం చెయ్యండి. ఖచ్చితంగా ఒంట్లో కొవ్వు తగ్గి బరువు తగ్గి చాలా ఈజీగా సన్నబడతారు. కష్టతరమైన వ్యాయామాలు చెయ్యలేని వారికి ఈ సూర్య నమస్కారం అనేది చక్కటి పరిష్కారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: