యూరిక్ యాసిడ్: ఇవి తాగి తగ్గించుకోవచ్చు?

Purushottham Vinay
ప్రస్తుతం చెడు ఆహారపు అలవాట్లు లేదా అధిక ఒత్తిడితో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. ఇది చివరికి మూత్రపిండాలు, గుండె, కాలేయ పనితీరుపై ప్రభావితం చేస్తుంది. శరీరం, కండరాలలో నొప్పిని పెంచుతుంది.గ్రీన్ టీని తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరగడం మాత్రమే కాదు.. ఇంకా అదే సమయంలో ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు కొన్ని రోజుల్లో సహజంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.తాజా క్యారెట్ జ్యూస్‌లో ఒక చెంచా నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఎందుకంటే.. క్యారెట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఫైబర్, బీటా కెరోటిన్, మినరల్స్ ఉన్నాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీనికి నిమ్మరసం కలపడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. సహజంగా రోగనిరోధక శక్తిని, కణాల పునరుత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.


దోసకాయ రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కాలేయం, కిడ్నీలు శుద్ధి అవుతాయి. రక్తప్రవాహంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. పొటాషియం, భాస్వరం ఉండటం వల్ల మూత్రపిండాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును పెంచడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.అలాగే ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అల్లంలోని క్రిమినాశక, శోథ నిరోధక గుణాలు ఉండటమే కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు సహజంగా మంట, కీళ్ల నొప్పులు, శరీర నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.యూరిక్ యాసిడ్ అనేది మన మూత్రపిండాల్లో రాళ్లను పెరిగేలా చేస్తుంది. ఆర్థరైటిస్, గౌట్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల, శరీరాన్ని సహజంగా నయం చేయడానికి ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ వల్ల కలిగే నష్టాన్ని సరిచేయడానికి పైన తెలిపిన విధంగా ఆహారంలో మార్పులు చేయడం చేయడం ద్వారా ఈజీగా నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: