కళ్ళు ఎర్రగా మారుతున్నాయా.. అయితే ఆ వ్యాధి కావొచ్చు..?

Divya
మారుతున్న జీవనశైలి విధానానికి తగ్గట్టుగానే మన ఆహారంలో కూడా ఎన్నో మార్పులను చేసుకుంటూ ఉండడం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా ఎక్కువ అవుతుందని ఒక అధ్యయనంలో వెల్లడించారు.. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో ఇలాంటి సమస్యలు కాస్త ఎక్కువగా కనిపించేవి కానీ ప్రస్తుతం కేవలం 20 ఏళ్లలోపు నిండిన వారికి ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉండడంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు.. హైబీపీ వల్ల కాలక్రమమేన ఇది గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా కారణమవుతుందట.. రక్తపోటు అధికంగా ఉందని ముందుగా సూచించే లక్షణాల గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

అధిక బీపి వల్ల మన శరీరంలో రక్తప్రసరణ వేగం కూడా చాలా పెరుగుతుందట. ముఖ్యంగా ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్తాన్ని పంపించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.. దీనివల్ల సిరలలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇది గుండె ఆగిపోవడానికి ముఖ్య కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. సాధారణంగా హై బీపీ ఎక్కువగా ఉన్నవారిలో చెమట గుండె కొట్టుకోవడంలో కూడా వేగం కనిపిస్తుందట.

ఇవే కాకుండా మరికొన్ని లక్షణాలలో కళ్ళు చీకట్లుగా అయిపోయిన భావన కల్పించడం.. ఒక్కసారిగా పడిపోవడం వంటివి హైబీపీ లక్షణంగా కూడా ఉంటాయట.

కొన్ని సందర్భాలలో ఏ పని చేయకున్నా కూడా చెమట రావడం నిద్రలేమి సమస్యలు ఉండడం వల్ల కూడా హైవిపీ లక్షణాలుగా ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.. ఇటీవలే అమెరికన్ హార్ట్ సైంటిస్టులు కొన్ని పరిశోధనలు తెలిపిన ప్రకారం కళ్ళు ఎర్రబడడం కళ్ళల్లో రక్తపు మచ్చలు కనిపించిన కూడా అది హైబీపీకి లక్షణంగా కారణమని తెలియజేశారు.

కొన్ని సందర్భాలలో మాత్రం షుగర్ వ్యాధి కలిగి ఉన్న వారిలో కూడా కళ్ళు చాలా ఎర్ర పడుతున్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. ఒకవేళ కళ్ళు ఎర్రబడినట్టుగా ఎక్కువ రోజులు ఉంటే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. హాయ్ బిపి ఉండడం వల్ల కళ్ళలోని నరాల పైన చాలా ఒత్తిడి ఏర్పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: