ఎండాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన కూరగాయ ఇదే?

Purushottham Vinay
ఎండాకాలం వచ్చేసింది. బయట తిరగకుండా ఉండటం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం అంతే ముఖ్యం.ఈ ఎండా కాలంలో బీరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.బీరకాయలో పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ కూడా ఉన్నాయి.పైగా ఇది పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.బీరకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అలాగే మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది తిన్న తర్వాత, సాధారణంగా గ్యాస్ లేదా అజీర్ణం గురించి ఆందోళన ఉండదు.ఇందులో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. 


ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, బీరకాయ కూరగాయ బరువు నియంత్రణకు గొప్ప ఎంపికగా పరిగణిస్తారు.బీరకాయ అనేది పోషకాలతో నిండిన కూరగాయ.. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు దాగున్నాయి. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం.మృదువైన స్వభావం కలది.. సులభంగా ఉడుకుతుంది.. నిమిషాల్లోనే కూర అవుతుంది.. బీరకాయను పలు రకాలుగా వండుకుని తింటారు. చాలామంది పచ్చడిని తినేందుకు ఇష్టపడతారు. అత్యధిక నీటిశాతం కలిగిన బీరకాయను ఎండాకాలంలో తింటే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలు దాగున్న బీరకాయను క్రమం తప్పకుండా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి ఖచ్చితంగా తినండి.ఇది భారతదేశంలో తినే చాలా సాధారణమైన కూరగాయ.. దీనిలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా నిండి ఉన్నాయి. నిజానికి బీరకాయ నుంచి తయారుచేసిన వంటకాలను చాలా మంది ఇష్టపడతారు.దీంతో మీరు అనేక రకాల వెరైటీలు చేసుకొని కూడా తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: