ఇంట్లో టైల్స్ మీద పడిన మరకలు పోలేదా.. అయితే ఈ టిప్స్ ఉపయోగించండి..!!

Divya
ఇప్పుడు ఎవరింట్లో చూసినా కూడా ఎక్కువగా టైల్స్ వంటివి వేయించుకుంటూ ఉంటున్నారు. ఇవి అందంగా కనిపిస్తాయని అంతేకాకుండా ఇల్లు చూడడానికి కూడా చాలా క్లీన్ గా కనిపిస్తుందని చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే వీటి పైన ఏవైనా మరకలు పడితే మాత్రం అంత త్వరగా వెళ్ళిపోవు.. అలా మరకలు పడినప్పుడు వీటిని చూస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కిచెన్ లోని టైల్స్ అయితే చాలా శ్రద్ధ పెట్టి మరి తిక్కుతూ ఉండాలి.. వీటివల్ల రంగు కూడా అప్పుడప్పుడు పోతూ ఉంటుంది.అయినా కూడా ఎన్నోసార్లు టైల్స్ మీద పడినటువంటి మరకలు పోవు.. ఈ మరకలను సైతం వదిలించుకోవడానికి నానా తండాలు పడవలసి ఉంటుంది. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చాలా బాగా ఉపయోగపడతాయి వాటి గురించి చూద్దాం.

బాత్రూంలో నైనా కిచెన్ లోనైనా సరే టైల్స్ పైన ఉండేటువంటి మరకలను త్వరగా పోవాలి అంటే.. కొంత వెనిగర్ నీటిని బాగా కలిపి మరకలు ఉన్నచోట స్ప్రే చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి స్క్రబ్ తో తుడిచేస్తే వెంటనే ఆ మరకలు సైతం తొలగిపోతాయి..

బాత్రూంలో ఎక్కువగా టైల్స్ పైన మసకబారినట్టుగా మరకలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కులాయి బాత్రూం సీటు పైన కూడా ఎన్నో మరకలు కనిపిస్తూ ఉంటాయి.. అయితే వీటన్నిటిని పోగొట్టాలి అంటే గోరువెచ్చని నీటిలోకి కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ని లేదా బేకింగ్ సోడా ని వేసి ఆ మరకలు ఉన్నచోట రెండు నిమిషాలు ఆ నీటిని పోసి తర్వాత బ్రష్ తో లేదా స్పాంజ్తో రుద్దడం వల్ల వెంటనే ఆ మరకలు సైతం తొలగిపోతాయి.

కాస్త గోరువెచ్చని నీటిలో డిష్ సోప్ వాటర్ కలిపిన తర్వాత స్టిక్ తో ఇంటినంతా శుభ్రం చేసి ఆ తర్వాత సాధారణ వేడి నీటితో ఇంటిని శుభ్రం చేయడం వల్ల మరొకరు డిష్ సోప్ వాటర్ ను ఆద్ధీ తుడిస్తే ఈజీగా మరకలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: