రామ్ చరణ్ కి కవలలు పుట్టిన వేళ ..ట్రెండింగ్ లో ఎన్టీఆర్ పేరు ఎందుకంటే..?
అయితే ఈ శుభసందర్భంలో ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం పరిపాటి. కానీ ఈసారి మాత్రం ఆశించిన స్థాయిలో సెలబ్రిటీ స్పందనలు కనిపించలేదన్న చర్చ మొదలైంది. ఇప్పటివరకు రామ్ చరణ్‌కు ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే ముందుకు రావడం గమనార్హం. ఇదే అంశం ఇప్పుడు అభిమానుల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి వారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం పలు అనుమానాలకు, విశ్లేషణలకు కారణమైంది. అయితే దీనిపై చాలా మంది అభిమానులు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. “సొంత కుటుంబం అంటే సోషల్ మీడియా అవసరమేంటి? వాళ్లు తప్పకుండా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పి ఉంటారు, వెళ్లి కలిసి కూడా ఉంటారు” అని సమర్థిస్తున్నారు. నిజానికి ఇది చాలా సహజమైన విషయమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన పోలిక కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. గతంలో క్లిన్ కారా జన్మించిన సమయంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో వారి పోస్టులు వైరల్ అయ్యాయి కూడా. కానీ ఈసారి అలాంటి స్పందనలు కనిపించకపోవడంతో అభిమానులు దీనిపై ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర మరింత ప్రత్యేకంగా మారింది. క్లిన్ కారా పుట్టినప్పుడు ఎలా అయితే ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడో, ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఈ ట్వీట్ లేదా పోస్టును చూసిన వెంటనే అభిమానులు ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. “ఇలాంటి స్నేహం అరుదు”, “స్నేహితులు అంటే ఇలా ఉండాలి” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.