ఈ అలవాట్లు మానుకోపోతే చాలా దారుణమైన జబ్బులు ఖాయం?

Purushottham Vinay
ఈ రోజుల్లో మనలో చాలా మంది కూడా ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలనే  చేస్తున్నారు. శారీరక శ్రమ చేసే వారు నేటి కాలంలో బాగా తగ్గిపోతున్నారు. దీంతో చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామం, జాగింగ్, సైక్లింగ్, యోగా వంటి వాటిని చేయడం అలవాటుగా చేసుకోవాలి.అలాగే ధూమపానం కూడా మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ధూమపానం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు ఇంకా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధూమపానానికి కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక మారిన జీవన విధానం వల్ల చాలా మందికి కనీసం సూర్యకాంతి కూడా తగలడం లేదు. దీంతో విటమిన్ డి లోపంతో పాటు శరీరంలో రోగనిరోధఖ శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రతి రోజూ శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి.అతిగా మద్యం సేవించడం వల్ల మనం తీవ్రఅనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండడం చాలా మంచిది.


అదే విధంగా సెల్ ఫోన్ లను, డిజిటిల్ పరికరాలను ఎక్కువగా వాడడం కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. వీటిని ఎక్కువగా వాడడం వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతుంది. ఆందోళన ఎక్కువవుతుంది. కంటి చూపు మందగిస్తుంది. వివిధ రకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక వీటిని కూడా అవసరాన్ని బట్టి వాడడం మంచిది. అలాగే ఈ కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. నిద్రలేమి కూడా మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తుంది. నిద్రలేమి కారణంగా ఊబకాయం, గుండె జబ్బులు, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉరుకుల పరుగుల జీవితం కారణంగా మనలో చాలా మంది వ్యాయామం చేయడం లేదు.నేటి తరుణంలో ఒత్తిడి ఒక తీవ్రసమస్యగా మారింది. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా హార్మోన్ల అసమతుల్యత, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడడం, నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యల బారిన పడడం జరుగుతుంది. కనుక మనం వీలైనంత వరకు ఒత్తిడి మన దరి చేరకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: