డయాబెటిస్ పేషెంట్లు ఈ పండ్లు తినకపోవడమే మంచిదా..!!

Divya
ప్రస్తుతం సమాజంలో చాలామంది ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా అందులో ఎక్కువ మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు.. ఈ డయాబెటిస్ తో బాధపడుతున్న వారు తీసుకొనే ఆహార పదార్థాలలో చాలా జాగ్రత్తలను కూడా తీసుకుంటూ ఉండాలని వైద్యుల సైతం సూచిస్తూ ఉంటారు.. అలాగే వీరు వారంలో రెండుసార్లు అయినా కూడా డయాబెటిస్ టెస్ట్ కూడా చేయించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి ఒక్కసారి వస్తే అంత సులువుగా మాత్రం వెళ్ళదు.. క్రమబద్ధక మైన ఆహారపు అలవాట్లను.. వ్యాయామం చేస్తూ ఉండడం వల్ల ఈ వ్యాధి అదుపులో ఉంటుందట.

అలాగే కొన్ని రకాల పండ్లను కూడా దూరంగా ఉంటే శరీరంలో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. మధుమేహ వ్యాధి గ్రహస్తులు తినకూడని పండ్ల విషయానికి వస్తే.. ముఖ్యంగా మామిడి పండ్లు కూడా ఒకటి ఇందులో కాస్త చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్రాక్ష పండు లో కూడా కొంతమేరకు షుగర్ ఉంటుంది.అందుకే వీటిని కాస్త దూరంగా ఉంచడమే మంచిది.. అలాగే వెర్రి పండ్లలో కూడా కాస్త చెక్కెర నిల్వ ఉంటుంది కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది..

పుచ్చకాయ కాస్త తక్కువ మోతాదులో తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. అజీరా పండ్లలో చక్కెర స్థాయిలు చాలా తక్కువ మోతాదులలో కలిగి ఉండడం వల్ల వీటిని తినవచ్చు..అలాగే అరటి పండ్లలో కేవలం 14 గ్రాముల షుగర్ మాత్రమే ఉంటుంది. దీన్ని తినాలనిపిస్తే రోజులో ఒకటి మాత్రం తినవచ్చని నిపుణుల సైతం తెలియజేస్తున్నారు.. అయితే మిగిలిన పండ్లలో చక్కెర శాతాన్ని బట్టి వాటిని తినడం మంచిదని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. అయితే కొన్నిటిని తినడం వల్ల ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి.. ఏవైనా పండ్లను తినేటప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించి తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: