ఫ్రిజ్లో పెట్టిన పుచ్చకాయను తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

Divya
ఎండాకాలం మొదలైంది అంటే చాలు మార్కెట్లో ఎక్కువగా లభించే పండ్లు, చెరుకు రసం, లెమన్ జ్యూస్ ఇతరత్రా రసాలను చాలా మంది ప్రజలు తాగుతూ ఉంటారు.. ముఖ్యంగా రంజాన్ సీజన్ తో పాటు వేసవికాలం కావడంతో మార్కెట్లో ఎక్కువగా పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది వీటిని కట్ చేసి రోడ్ల పైన విక్రయిస్తూ ఉంటారు. శరీరం డిహైట్రేట్ కాకుండా ఉండేందుకు చాలా మంది ప్రజలు కూడా పుచ్చకాయలను కొనుగోలు చేసుకుని వాటిని తింటూ ఉంటారు.అయితే ఈ పుచ్చకాయను తెచ్చిన వెంటనే దానిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయకూడదని దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

ఎండాకాలం కావడం చేత ఎండలు చాలా వేడిగా ఉంటాయి.. పుచ్చకాయల దాదాపుగా 90% వరకు నీటి శాతం ఉంటుంది. ఇది మన శరీరం డ్రీహైడ్రేటుకు గురి కాకుండా చేస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బలు వంటివి తగలకుండా పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గాలనుకునేవారు వీటిని తినడం మంచిది. ఇందులో సిట్రులైన్ నైట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ పెరగకుండా సేవ్ చేస్తుంది. ఈ పుచ్చకాయ గింజలలో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయట.

పుచ్చకాయలలో విటమిన్-A,C , అమినో యాసిడ్ అంటే పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా లైకోపిన్ అనేది ఉంటుంది. ఇది క్యాలరీలను కూడా తక్కువగా కలిగి ఉంటుంది. మరి కొంతమంది జ్యూస్ తయారు చేసుకుని ఈ పుచ్చకాయతో తాగుతూ ఉంటారు. మార్కెట్లో నుంచి కొంతమంది పుచ్చకాయలు తెచ్చి కట్ చేసి మిగిలిన బాగా సగం ఫ్రిజ్లో నిల్వ చేస్తారు. ఇందులో బ్యాక్టీరియా పెరిగిపోతుందట. ఇది మన శరీరానికి చాలా హానికరం చేయడమే కాకుండా కడుపు సంబంధిత సమస్యలను కూడా పెంచేలా చేస్తుంది. అయితే కేవలం రూమ్ టెంపరేచర్ లో పెట్టి తినడం మంచిదని నిపుణులు అయితే తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: