ఈ పోషకం ఉన్న ఆహారాలు ఖచ్చితంగా తినాలి?

Purushottham Vinay
విటమిన్లు, మినరల్స్, ఫైబర్, మెగ్నీషియం ఇంకా పొటాషియం మన శరీర ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. అయితే వీటన్నింటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. అందుకే ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఖచ్చితంగా తినాలి.వీటిని తింటే చాలా ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు రాకుండా హెల్తీగా ఉంటాము.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. వాల్ నట్స్ తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇంకా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.బరువు తగ్గడానికి మనలో చాలా మంది కూడా తరచుగా చియా గింజలను తింటారు. అయితే ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా కూడా పరిగణిస్తారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, చియా విత్తనాలు తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని బాగా తగ్గించవచ్చు.అవిసె గింజలలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది.


అవిసె గింజల ద్వారా శరీరానికి అందే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లుగా మారుతుంది.అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. సగటు మనిషి రోజూ 1.6 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను తన ఆహారంలో చేర్చుకోవాలి. అదే సమయంలో, మహిళలు తమ ఆహారంలో 1.1 గ్రాముల ఒమేగా 3 చేర్చుకోవాలి. శాకాహారులు కొన్ని పదార్థాలను తీసుకుంటే ఒమేగా 3 లోపం నుంచి బయటపడొచ్చు..ఒమేగా 3 ఆరోగ్యకరమైన కొవ్వులలో ఇవి కీలకమైనవి.. కానీ మన శరీరం ఈ కొవ్వులను ఉత్పత్తి చేయదు. ఇందులో మూడు రకాల కొవ్వులు ఉంటాయి - EPA, ALA, DHA.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలలో సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా నాన్ వెజ్ ఫుడ్స్‌లో పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల, శాకాహారి లేదా శాఖాహార ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు ఒమేగా 3 లోపాన్ని తీర్చడం కొంచెం కష్టమవుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభించే అనేక మొక్కల ఆధారిత ఆహారాలు ఉన్నాయి. వీటితో దీని లోపాన్ని మనం తీర్చవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: