ఎండబెట్టిన అల్లంతో పెట్టిన టీ వల్ల కలిగే ప్రయోజనాలివే..!

Divya
సాధారణంగా పూర్వం రోజుల్లో జ్వరం వచ్చినా,జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు అయినా సరే ఎటువంటి మెడిసిన్ వాడేవారు కాదు.ఇంకా చెప్పాలి అంటే తలనొప్పి వస్తే చాలు అల్లంతో తయారు చేసిన టీ తాగేవారు. దానితో చిటికెలో తలనొప్పిని పోగొట్టుకునేవారు.ఎందుకంటే అల్లంలో ఉండే సుగుణాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇలా అల్లం తరచూ లభించదు కనుక ఎండబెట్టిన అల్లం తీసుకునేవారు.ఈ అల్లంనే సరైన పద్ధతుల్లో ఎండబెట్టడం ద్వారా సొంటి లభిస్తుంది.దీనిని తరచూ టీ చేసుకొని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
జీర్ణ సమస్యలు తొలగించడానికి..
అల్లం టీ మోషన్ సిక్‌నెస్,గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్,శస్త్రచికిత్స అనంతరం కలిగే వికారంను తగ్గించే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ టీ ఆహారం చక్కగా అరిగేలా చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించడానికి..
అల్లంను ఉడకబెట్టడం వల్ల వచ్చే ఆరోమా ఒత్తిడి నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.ఈ అల్లం టీని తరుచూ తీసుకోవడంతో  శారీరక విశ్రాంతిని,మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడానికి..
ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమెటరీ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కళంగా లభిస్తాయి.దీనితో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది.అంతే కాక జలుబు,దగ్గు వంటి వాటితో బాధపడేవారికి దీనికి మించిన మెడిసన్ లేదని చెప్పవచ్చు.
ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికి..
చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ మరియు ఇన్ఫ్లమేషన్ వల్ల ఒళ్ళు నొప్పులు,కాళ్ల నొప్పులు, నడుము నొప్పి అంటూ బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు రోజుకు ఎండబెట్టిన అల్లం అరంగుళం మోతాదులో తీసుకొని,తేనెలో కలిపి తీసుకోవడం వల్ల ఇన్ఫల్మేషన్ తగ్గిపోయి నొప్పులు కంట్రోల్ అవుతాయి. దీనితో పాటు స్త్రీలలో అధికంగా ఉన్న పీరియడ్ సమస్యలు కూడా తగ్గుతాయి.
బరువు తగ్గడానికి..
చాలా పరిశోదనల్లో అల్లం తీసుకోవడంతో ఆకలి అదుపులో ఉంటుందని తేలింది.మంచి డైట్,వ్యాయామాలతో పాటు అల్లం టీ తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతుంది.
కావున మీరు కూడా ఇక ఎండబెట్టిన అల్లం టీ తాగడం అలవాటు చేయనుకోండి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: