రెడ్ రైస్ తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా..?

Divya
చాలామందికి రెడ్ రైస్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఇది మనం తినే వైట్ రైస్ కంటే కాస్త ఎక్కువగా మేలు చేస్తుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. గ్రామాలలో ఈ రైస్ ని బ్లాక్ రైస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈ రెడ్ రైస్ ని మనం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా నయం చేయడంలో ఉపయోగపడుతుంది.. ఈ రెడ్ రైస్ లో ఉండే ఎన్నో ఔషధ గుణాలు కూడా మన శరీరానికి పుష్కలంగా అందుతాయి..

ఈ రైట్ డ్రెస్ ఎక్కువగా కేరళ ,కర్ణాటక, తమిళనాడు దక్షిణ భారతదేశంలో ఇతరత్రా ప్రాంతాలలో చాలా సాంప్రదాయమైన బియ్యంగ వీటిని కొలుస్తారు.. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులను సైతం తగ్గించడానికి ఈ రెడ్ రైస్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను సైతం ఉండకుండా చూస్తుంది.. రక్తంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలను కూడా తగ్గించడానికి ఈ రెడ్ రైస్ ఉపయోగపడతాయి.

ఈ రెడ్ రైస్ డయాబెటిస్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది.. వీటిని తింటే రక్తంలో సైతం షుగర్ లెవెల్స్ పెరగకుండానే ఉంటాయట. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుందని సులువుగా జీర్ణమయ్యేలా ఉంటాయి.. రెడ్ రైస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం తిన్న కడుపు నిండుగా అనిపిస్తుందట.. ఇందులో కార్బోహైడ్రేడ్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కూడా శక్తిని అందించడంలో సహాయపడతాయి.. ఈ రెడ్ రైస్ లో విటమిన్, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా చాలా సహాయపడతాయి. ఈ రెడ్ రైస్ గుండెకు చాలా మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: