కోడి గుడ్డుతో చేసే ఈ వంటకం ఎంతో ఆరోగ్యకరం?

Purushottham Vinay
కోడిగుడ్డుతో రకరకాలుగా కూరలు,ఫ్రై లు చేసుకుంటూ ఉంటాం.అయితే పప్పు,పచ్చడి,టైం లో ఆమ్లెట్ వేసుకుని తినే అలవాటు మనలో చాలా మందికి ఉంది.గుడ్డు వేపుడు మనకి తెలిసిందే,గుడ్డు టమాటో పులుసు,బంగాళాదుంప విత్ ఎగ్ కర్రీ కాబినేషన్,సూపర్ ఉంటుంది.ఐతే ఎప్పుడూ ఇలా రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీ గా ట్రై చేస్తూ ఉండండి.ఇప్పుడు కొత్తగా ఆమ్లెట్ తో కర్రీ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.అందుకే ఈసారి ఆమ్లెట్ కర్రీ ట్రై చేద్దాం.ముందుగా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు,ఒక కప్పు టమాట ముక్కలు,ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఒక ఐదు కోడిగుడ్లని ఒక్కొకటిగా ఉప్పు,కారం,చల్లుకొని విడి విడిగా ఆమ్లెట్స్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు కడాయిలో నూనే వేసుకొని అందులో బిర్యాని దినుసులు మొత్తం వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.


తర్వాత గుప్పెడు పోదీనా గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక నిముషం వేగనివ్వాలి.తర్వాత దీనిలో ముందుగా చేసి పెట్టుకున్న టమాట ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకోవాలి.రెండు నిముషాలు తరువాత సరిపడా ఉప్పు,పసుపు,కారం,ఒక స్పూన్ గరం మసాలా పొడి,హాఫ్ స్పూన్ ధనియాలా పొడి,వేసి అన్ని కలిసిపోయేలా కలుపుకోవాలి.సన్నని మంటమీద నూనే పైకి తెలేవరకు అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి.తర్వాత ఇందులో పావు లీటరు నీళ్లు పోసి కొంచెం మరిగాక ఈ ఆమ్లెట్స్ వేసుకోవాలి.సన్నని మంటమీద ఈ వాటర్ ని ఆమ్లెట్స్ పీల్చుకుని కూర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి.ఇలా చిక్కబడిన కర్రీ లో చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఘుమఘుమలాడే ఆమ్లెట్ కర్రీ రెడీ.ఈ ఆమ్లెట్ కర్రీ చపాతి,రైస్,పూరి,రాగి సంగటి,దేనిలోకైనా టేస్ట్ సూపర్.ఇంకెందుకు మరి లేట్ మీరు కూడా ఈ ఆమ్లెట్ టమాట కర్రీ ట్రై చేసి చూడండి.ఒక్కసారి దీన్ని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తిన్నాలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: