వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే.. కర్బుజజే దిక్సూచి..!!

Divya
వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లగా ఉండేందుకు పలు రకాల పండ్లను తింటూ ఉంటారు.. ముఖ్యంగా వేసవికాలంలో పుచ్చకాయలు, మామిడికాయలు, కర్బూజా, చెరుకు రసం ఇలా ఎన్నిటినో తినడానికి ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు.. ముఖ్యంగా మల్కు మిలన్ గా పిలిచేటువంటి ఖర్భుజ పండును తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు.. వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేటుగా ఉంచేందుకే ఈ పండు ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థను కూడా చాలా బలంగా ఉండేలా చేస్తుంది.
కర్బుజ పండులో పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్..C,A,K,B వంటివి పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యాన్ని సైతం ఉంచేలా చేస్తాయి. అలాగే విటమిన్ కే వల్ల ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే రక్తం గడ్డ కట్టడానికి కూడా సహాయపడుతుంది. ఈ మస్క్ మిలన్ లో ఉండేటువంటి బి కాంప్లెక్స్ విటమిన్ ల వల్ల మెదడులోని నాడీ వ్యవస్థ పైన చురుకుగా ఉండేలా సహాయపడుతుంది.

కర్బుజాలు ఎక్కువగా నీటి కంటెంట్ ఉండడం వల్ల శరీరాన్ని హైడ్ రేట్ అయ్యేలా చేస్తుంది. ఎలాంటి వేడి వాతావరణం లోనైనా సరే చల్లదనంగా ఉండేలా చేస్తుంది.

హానికరమైన ఫ్రీ రాడికల్స్ ని తట్టుకొని శక్తి మన శరీరానికి అవసరమయ్యేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ కర్బుజ పండులో ఉన్నాయి.
క్రమం తప్పకుండా కర్బూజ పండును తినడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది.. కర్బుజ పండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియలో చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పేగు కదలికలను చాలా సులభంగా అయ్యేలా చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా వంటి పెరుగుదలను కూడా ప్రోత్సహించకుండా చేస్తుంది.

కర్బూజ పండు షుగర్ పేషెంట్లు కూడా తినడం వల్ల పలు రకాల లాభాలు ఉంటాయి.. అయితే సమ్మర్ లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి పిల్లలకు కూడా వీటిని ఎక్కువగా తినిపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: