మందారంలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయా?

Purushottham Vinay
మందారం ఈ పువ్వు గురించి కానీ ఈ చెట్టు గురించి కానీ తెలియనివాలంటూ ఉండరు.చాలామంది వాళ్ళ ఇళ్లలో ఇతరమొక్కలతో పాటు మందార మొక్కని కూడ పెంచుతూ ఉంటారు.దీనికి అందమైన రంగు రూపం ఉంటుంది.కానీ వాసన ఉండదు.మరి సువాసన లేని ఈ చెట్టుని అంత ఇష్టంగా ఎందుకు పెంచుతారో తెలుసా?దీనిలో అందాన్ని పెంచే గుణాలను పుష్కళంగా కలిగివుంటుంది కాబట్టి ఈ మొక్కని పెంచుకుంటారు.అయితే ఆ అందాన్ని పెంచే గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.దీన్ని మాల్వేసి కుటుంబానికి చెందిన మొక్కగా గుర్తించారు. ఈ పువ్వు చూడటానికి ఆకర్షనియంగా అందంగా అందరిని ఆకట్టుకుంటుంది.అయితే జుట్టు సమస్యలు ఉన్న వారికి మందారం ఒక మంచి ఔషదం అని చెప్పొచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


గుప్పెడు మందార ఆకుల్ని కొన్ని మందార పువ్వులని సేకరించి వీటిని మెత్తగా నూరి ఆ పేస్ట్ ని తలకి పెట్టడం వల్ల జుట్టు సిల్కీ గా మెరిసిపోతూ ఉంటుంది.కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు కొన్ని మెంతులు వేసి వాటితో పాటు ఈ మందార ఆకులు లేదా పువ్వులు గుప్పెడు వేసి నూనెలో బాగా రంగు మారేవరకు వేడిచేసి వడకట్టి ఆ నూనెను వారానికి మూడు రోజులు తలకి పెట్టుకోవడం వల్లా అతి తక్కువ సమయంలోనే మీరు నల్లని పొడవైనా జుట్టు మీ సొంతం చేసుకోగలరు.చుండ్రు, జుట్టు రాలడం,జుట్టు చివరన చిట్లడం వంటి సమస్యలు దీన్ని వాడటం వల్ల తగ్గించుకోవచ్చు.అంతేకాదు యాంటీడయాబెటిక్ లక్షణాలు కలిగిన ఈ పూలని తినడం వల్ల శరీరంలో సంభవించే సమస్యలని నివారించవచ్చు.


అందుకే కొంతమంది ఈ పూలతో డికాషిన్ చేసుకొని తాగుతూ ఉంటారు.దీని ఆకులు కురులకి మంచి కండిషనర్గా పని చేసి దుమ్ము దూలి నుండి రక్షణ ఇస్తుంది.సువాసన గుణం లేకపోయినా దీన్ని పూజలకి వ్రతాలకి ఉపయోగిస్తూ ఉంటారు.మహిళలు ఈ పూలని అలంకరణగా తల్లో పెట్టుకుంటారు.ఇందులో రకాలు కూడా ఉన్నాయి.ముద్దామందారం,వంటిరెక్కమందారం,తెల్లమందారం,పసుపుమందారం,ఇలా ఇందులో రకాలు కలిగి ఉన్నాయి.మాదారం ఆకుల్ని పువ్వులని వాడటం వల్ల ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయనమాట.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ మొక్కని నాటండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: