కలగురతో విటమిన్ లోపాన్ని కట్టడి చేయొచ్చని మీకు తెలుసా..?

Divya
పూర్వం రోజుల్లో మన పెద్దలు సమయం లేక కూరగాయలు అన్నిటినీ కలిపి,ఒక కూరగా తయారు చేసుకుని తినేవారు.దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియదు కానీ..సమయం కలిసి వస్తుందని మాత్రమే దీనిని చేసుకొని వండుకొని తినేవారు.అదే సమస్య ఇప్పుడు కూడా ఉంది కదా.చాలామందికి సమయం లేక రకరకాల జంక్ ఫుడ్ లు తింటూ,రకరకాల విటమిన్ లోపాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.అలాంటివారికి ఈ కలగూర చాలా బాగా ఉపయోగపడుతుంది.అస్సలు కలగూరలో ఎలాంటి కూరగాయలు కలుపుకొని తినాలో,వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి..
దీనికోసం ముందుగా ఒక మందంపాటి బాండి తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేయాలి.ఇప్పుడు ఇందులోనే అర కప్పు బీన్స్,అరకప్పు బటాని గింజలు, అర కప్పు క్యారెట్ ముక్కలు,అర కప్పు ఉల్లిపాయలు టమోటాలు, రెండు వెల్లుల్లి రెబ్బలు,చిటికెడు ఆవాలు మరియు చిటికెడు ఆ జీలకర్ర,చిటికెడు పసుపు వేసి మూత పెట్టి సన్నటి సగమై సెగపై ఉడికించుకోవాలి.ఇలా ముక్కలు అన్నీ బాగా ఉడికిన తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకొని,పప్పు గుత్తితో పప్పులా మెదపాలి. ఇప్పుడు తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి,అందులో పచ్చి కరివేపాకు,రెండు ఎండుమిరపకాయలు,చిటికెడు,జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి.
ఈ కలగూరను సైడ్ డిష్ గా తీసుకోవడం కూడా చాలా మంచిది.చాలామంది పిల్లలు కాయగూరలు తినాలంటే అంతగా ఇష్టపడరు.అలాంటి పిల్లలకు ఎక్కువగా విటమిన్ లోపాలు కలుగుతుంటాయి.అటువంటి వారికి టిఫిన్స్ కి చట్నీలా ఇస్తే, వారు ఎక్కువ కూరగాయలు తిన్నట్టు అవుతుంది.మరియు విటమిన్స్ లోపము కుడా తలెత్తదు.
ఎందుకంటే ఇందులో వేసిన కూరగాయలు అన్నిటిలోనూ విటమిన్ సి మరియు విటమిన్ ఏ,విటమిన్ b6,బీటా కెరోటీన్ వంటి అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి.ఈ కలగూరను గర్భిణీ స్త్రీలకు తరచూ ఇవ్వడం వల్ల, ఇందులో ఫోలిక్ యాసిడ్ లభించి వారి రక్తహీనత సమస్య కూడా అదుపులో ఉంచుతుంది.మరియు ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా మధుమేహాన్ని కూడా దూరంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: