గుండె పోటు రాకుండా ఖచ్చితంగా ఇలా చెయ్యాలి?

Purushottham Vinay
గుండె పోటు రాకుండా ఖచ్చితంగా ఇలా చెయ్యాలి ?

ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే గుండె పోటుతో చాలా మంది చనిపోతున్నారు.చలికాలంలో ఖచ్చితంగా కొన్ని పనులు చెయ్యాలి. లేదంటే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ప్రతి రోజు తేలికపాటి వ్యాయామం చేయాలి. వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, ఇంట్లో యోగా చేయడం చేయడం వల్ల గుండె ఖచ్చితంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.గుండె పోటు రాకుండా ఖచ్చితంగా ఇలా చెయ్యాలి.అలాగే కొవ్వు, తీపి పదార్థాలను తినడం తగ్గించాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు ఇంకా తృణధాన్యాలు ఖచ్చితంగా చేర్చుకోవాలి. అలాగే చలి నుంచి రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులు ధరించాలి. శరీర ఉష్ణోగ్రతను మెయింటెన్‌ చేయాలి.చాలా మంది కూడా శీతాకాలంలో  వేయించిన ఆహారాలు, స్వీట్లను తింటారు. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు సంభవిస్తుంది. శీతాకాలంలో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

ఈ ఇన్ఫెక్షన్లు శరీరంలో వాపును పెంచుతాయి. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.చలికాలంలో గాలిలో కాలుష్యం స్థాయి విపరీతంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాలుష్యం కారణంగా వాపు, కఫం, రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.చలి కారణంగా చాలా మంది ఇంట్లో నుంచి ఎక్కువగా బయటికి రావడానికి ఇష్టపడరు. ఇంటి లోపల ఉండడానికే ఇష్టపడతారు. దీని కారణంగా శారీరక శ్రమ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.చల్లటి వాతావరణంలో సిరలు కుచించుకుపోతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. గుండె కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. చలిలో శరీరంలో గడ్డకట్టే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు సంభవిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. గుండె పోటు రాకుండా జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: