ఈ ఒక్క కాయగూర తింటే ఏ సమస్య రాదు?

Purushottham Vinay
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల వైరస్, బ్యాక్టీరియా ల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఇక బ్రోకలీలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. బ్రోకలీని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. బ్రోకలీలో విటమిన్ ఎ, లూటీన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కంటి సమస్యలు రాకుండా కాపాడడంలో దోహదపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.బ్రోకలీని తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంగా తయారవుతాయి. దీనిలో క్యాల్షియంతో పాటు విటమిన్ కె కూడా ఉంటుంది.ఇవి ఎముకలను ఆరోగ్యంగా, బలంగా తయారు చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా బ్రోకలీ యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగిఉంటుంది. శరీరంలో ఉండే వాపును, నొప్పులను తగ్గించడంలో బ్రోకలీ మనకు సహాయపడుతుంది.


బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంతో పాటు రక్తనాళాలు మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్రోకలీని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే దీనిలో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది.బ్రోకలీ క్యాన్సర్ నివారిణిగా కూడా పని చేస్తుంది. దీనిలో సల్పోరాఫేన్, ఇండోల్ 3 కార్బినోల్ వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంతో పాటు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ వంటి ఎన్నో పొషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.దీనిని తీసుకోవడం వల్ల జీవశక్తి పెరుగుతుంది.అందుకే బ్రోకలీని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: