ఆపరేషన్ లేకుండానే మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఇంటి చిట్కాలు..!!

Divya
సాధారణంగా పూర్వం రోజుల్లో అయితే వయసు పైబడిన వారికి మాత్రమే మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు.కానీ ఈ మధ్యకాలంలో యూత్ కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు.ఇంకా చెప్పాలంటే నడుస్తుంటే కూడా సౌండ్ రావడం,మెట్లు ఎక్కినప్పుడు నొప్పిగా ఉండడం,కొంచెం దూరం కూడా నడవలేకపోవడం,నేలపై కూర్చొని పైకి లేవలేకపోవడం,బైక్ వంటివి రైడ్ చేయలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
ఇలాంటివారు అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్లు వాడినా కూడా,లోపల నుంచి వచ్చే పెయిన్ మాత్రం మరల మరల వస్తూనే ఉంటుంది.ఈ మోకాళ్ళ నొప్పులు ఇలానే ముదిరితే కచ్చితంగా ఆపరేషన్ అవసరమని డాక్టర్ సలహా ఇవ్వడం ఖాయం.ఇలాంటి కాకుండా మన ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పుల వల్లనే మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చని చాలా పరిశోధనలో చాలా పరిశోధనల్లో కూడా తేలాయి.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
ఉప్పు,కారం తక్కువగా తినడం..
ఉప్పు కారం ఎక్కువగా ఉన్న మసాలా ఆహార పదార్థాలు మరియు జంక్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అయోడిన్ అనేది ఎముకల చుట్టూ పేరుకుపోయి, ఆస్టియోపోరోసిస్ కి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి.కావున ఉప్పు,కారం తినడంపై అవగాహన తెచ్చుకోవడం చాలా ఉత్తమం.
క్యాబేజీ తినడం..
మనం తినే ఆహారం పైన మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.కావున మోకాళ్ళ నొప్పులకు అసలైన కారణం ఎముకల మధ్య సైనోవినల్ ఫ్లూయిడ్ తగ్గడం.ఈ ఫ్లూయిడ్ ని పెంచడానికి క్యాబేజ్,బ్రొకోలి,గోబీ వంటి కూరగాయలను ఎక్కువ కనీసం రోజు మార్చి రోజైనా తీసుకోవాల్సి ఉంటుంది.
బ్రౌన్ రైస్..
వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి.కనుక బ్రౌన్ వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా ఉత్తమం.అంతే కాక బ్రౌన్ రైస్ లో మోకాళ్ల నొప్పులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
వీటన్నిటితోపాటు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: