చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపించడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా మనం బయట వ్యక్తులను చూసినప్పుడు, కొంతమంది వయసు ఎక్కువగా ఉన్నా సరే,వయసు చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది.ముఖ్యంగా హీరోలాంటి వారికి ఎంత వయసు మళ్లీనా సరే,కుర్రాడు లాగా కనిపిస్తూ ఉంటారు.ఇంకొంతమంది అయితే ఎంత చిన్న వయసు అయినప్పటికీ కూడా వారు ఏదో 40,50 దాటేసినట్టు కనిపిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలి అంటే అలాంటివారు పదిమందిలోకి వెళ్ళినప్పుడు,వారిని ఆంటీ,అంకుల్ అని పిలుస్తూ ఉంటే తెగ నచ్చుకుంటూ ఉంటారు కూడా.దీనికి కారణం మన జీవనశైలిలోని మార్పులేనని చెబుతున్నారు నిపుణులు.మరి అవేంటో మనము తెలుసుకుందామా..
కాఫీలు టీలు..
కొంతమందికి అయితే కాఫీ టీలు పడందే వారి పనులు కొనసాగవు.కానీ ఈ కాఫీ టీ లను రోజుకు రెండు మూడు సార్లకు పైగా తాగుతూ ఉంటే,అందులోని కెఫెన్ మన రక్తంలోని కణాలను ఉత్తేజితం చేసి చేసి చివర్లకు తన శరీర కణాలు దెబ్బతీస్తుంది.మన శరీరంలో కణజాలం దెబ్బతిని శరీరం వయసు మళ్ళిన వారి వలె ముడతలు పడి, నిర్జీవంగా తయారవుతుంది.అంతేకాక ఇందులో వాడే షుగర్స్ కూడా మన జీవ కణజాలాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి.కావున యూత్ ఎంత వయసు ఉన్నా సరే యూదుల కనిపించాలంటే కాఫీ,టీలకు దూరంగా ఉండండి.
అధిక ఉప్పుకారాలు..
ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ మరియు బయట ఫుడ్ ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ దీనివల్ల అనవసరమైన ఉప్పు మరియు కారం మన శరీరంలో చేరుకుపోయి,మన శరీర కణజాలాన్ని దెబ్బతీయటమే కాకుండా,అనేక రోగాలను కూడా తెచ్చిపెడుతుంది.దీనివల్ల చాలామంది వయసు మళ్ళిన వారి వలె కనిపిస్తారు.
సరైన జీవనశైలి లేకపోవడం..
చాలామందికి సరైన జీవనశైలి అంటే సరైన ఆహారం సరైన మోతాదులో నీటిని తీసుకోకపోవడం,వ్యాయామం నడకా వంటివి చేయకపోవడం వల్ల కూడా శరీరం తొందరగా వృద్ధాప్య ఛాయాలను సంతరించుకుంటుంది. మరియు సరైన నిద్ర కూడా మన శరీర వయసును పెంచుతుంది.కావున ప్రతి ఒక్కరూ రోజుకు 7 నుంచి 8:00 నిద్ర పోవడం చాలా ఉత్తమం.
 మద్యపానం ధూమపానం..
 మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో శరీర వయసును పెంచడంలో కూడా అంతే హానికరం. కావున ఈస్ ఇలాంటి అలవాటు ఉన్నవారు కూడా తొందరగా వయసు మళ్ళిన వారిలో కనిపిస్తారు. కావున మీరు కూడా ఎంత వయసు పెరిగిన యూత్ లా కనిపించాలంటే అంటే ఈ అలవాట్లను తొందరగా మానుకుంటే చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: