మతిమరుపు సమస్య చిటికెలో తగ్గే టిప్?

Purushottham Vinay
మన మెదడు కణాలు ఒక్కసారి పుట్టాయంటే మళ్ళీ మరణించే వరకు అవే కణాలు ఉంటాయి. మెదడు కణాలు ఒక్కసారి గనుక మరణిస్తే మళ్ళీ పుట్టడం జరగదు. మెదడు కణాలు మరణించే కొద్ది వాటి సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం మెదడు కణాలు చనిపోకుండా, వాటిలో ఇన్ ప్లామేషన్ రాకుండా చూసుకోవాలి. మెదడు కణాలు  చనిపోతే మన మెదడుకి ఖచ్చితంగా చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ మనలో జరగకుండా చూసుకోవాలి. మన మెదడులో కొన్ని రకాల హానికారక ప్రోటీన్ లు విడుదలై మెదడు కణాలను నశింపజేస్తూ ఉంటాయి.మన మెదడులో టార్, బీటాఆమిలాయిడ్ వంటి ప్రోటీన్ లు మెదడు కణాలను, మెదడు ఆరోగ్యాన్ని నశింపజేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రోటీన్ లు మెదడు కణాలను నశింపజేయకుండా కాపాడడంలో మిరియాలు చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిరియాల్లో ఉండే పెప్పరిన్ మెదడు కణాలను నాశనం చేసే ప్రోటీన్ ను నశింపజేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మనం మిరియాలను వాడడం వల్ల వయసు పెరిగే కొద్ది వచ్చే మతిమరుపు, డిమెన్షియా వంటివి రాకుండా ఉంటాయి.మిరియాలను వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.అయితే ఈ విధంగా మిరియాలు మన మెదడు ఆరోగ్యానికి ఖచ్చితంగా మేలు చేస్తాయని మనలో చాలా మందికి కూడా తెలియదు.ఈ రోజుల్లో చాలా మంది వయసు పైబడే కొద్ది మతిమరుపు, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారు అలాగే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలనుకునే వారు మిరియాలను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. మిరియాలను వాడడం వల్ల చనిపోయిన కణాలు మళ్ళీ తిరిగి రానప్పటికి ఉన్న కణాలు మాత్రం దెబ్బతినకుండా ఉంటాయి. ఇక వంటల్లో కారానికి బదులుగా మిరియాలను వాడడం అలాగే సలాడ్స్, సూప్స్, మొలకెత్తిన గింజలు వంటి వాటిలో మిరియాల పొడిని వాడడం వల్ల మెదడు కణాల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: