ముఖం కడిగిన ముత్యంలా కనిపించాలంటే చేయాల్సిన పనులవే..!

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ అందంగా కనిపించాలని,నలుగురిలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు.ఇంక ఫంక్షన్లు ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు.కానీ ఈ మధ్యకాలంలో చాలామందికి మొటిమలు,మచ్చలు,మృత కణాలు అంటూ మొహాన్ని అందవిహీనంగా తయారు చేస్తూ ఉన్నాయి కదా.మరి ముఖ్యంగా యూత్లో అయితే మొటిమలు ఎంతకీ వదలక తెగ బాధిస్తూ ఉంటాయి. అలాంటివారు వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగక,దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి.ఇలాంటి వారి కోసం ఉదయం పూట చేసే కొన్ని పనుల వల్ల వారి మొహం నేచురల్ గా కడిగిన ముత్యంలా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరి అవి ఏంటో మనము తెలుసుకుందాం పదండి.
దీనికోసం ముందుగా ప్రతిరోజు,ప్రతి ఒక్కరు ఉదయం 10 గంటల లోపు కచ్చితంగా ఒక లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి.దీనివల్ల శరీరం డిహైడ్రేషన్ గురి కాకుండా,చర్మం అందంగా తయారవుతుంది. మరియు పోషకాలు కలిగి,అధిక ఉప్పు,కారాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా మొహంపై మొటిమలు,మచ్చలు ఉన్నా సరే తగ్గిపోయి,అందంగా తయారవ్వడానికి దోహదపడతాయి.
దీనితో పాటు కొన్ని రకాల స్క్రబ్బర్లు మరియు మాస్కులు మొహానికి అప్లై చేసుకోవడం వల్ల,చర్మం పై ఉన్న మృత కణాలు తొలగిపోయి మచ్చలు తగ్గుముఖం పడతాయి.అందులో ముఖ్యంగా నారింజ పండుతో వేసుకుని ఫ్రూట్ ఫేషియల్ చాలా బాగా ఉపయోగపడతాయి.
దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల నారింజ గుజ్జు తీసుకొని, అందులో ఒక స్పూన్ శెనగపిండి,ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.ఈ మాస్క్ ఉపయోగించడానికి ముందు మొహాన్ని బాగా శుభ్రం చేసుకుని,ఆ తర్వాత ఈ మాస్క్ ని అప్లై చేయాలి.కానీ ఈ మాస్క్ ని 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇది బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుని,మాయిశ్చరైసర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.ఇలా వారం రోజుల పాటు చేశారంటే చాలు ముఖం కడిగిన ముత్యంలో తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: