పూజ చేసేటప్పుడు చెడు ఆలోచనలు రావడానికి కారణలెంటో తెలుసా..?

Divya
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ పూజలు చేయాలని,దేవుని స్మరిస్తూ ఆనందంగా,ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరిగి వారి ఇంట్లో సకల సుఖాలు కలుగుతాయి అని కూడా నమ్ముతాము కదా.పూజలు నిర్వహించేటప్పుడు కొంతమందికి ఏవేవో చెడ్డ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి.అవి బయటకు చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాయి.ఈ ఆలోచనల వల్ల కొంతమంది పూజ చేయడానికి కూడా సంకోచిస్తూ ఉంటారు.అలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఈ మూడు జీవనశైలిలేనని చెబుతున్నారు వేద పండితులు.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
కళ్ళతో చూసినవి..
దేవుడిని పూజించేటప్పుడు మనసు ఆయన ముందు
లగ్నం చేయడానికి ఏవైతే మనం కళ్ళతో చూస్తామొ,అవే గుర్తుకు వస్తూ ఉంటాయి.చెడు చూస్తే చెడు,మంచి చూస్తే మంచు కచ్చితంగా గుర్తుకొస్తుంది.కావున ప్రతి ఒక్కరూ  మంచి వైపే మొగ్గు చూపాలి.దీనితో పూజలు సమయంలో చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి.
చెడు స్నేహం..
ఆరు నెలలు స్నేహం చేస్తే వారు విరావుతారని పెద్దలు ఊరికే చెప్పరు కదా.కొంతమందితో స్నేహం చేయడం వల్ల వారి మంచి గుణాలు మనకు రావడం ఎంత సహజమో,చెడ్డ వాడితో స్నేహం చేయడం వల్ల వారి చెడ్డ ఆలోచనలు కూడా మనకి రావడం అంతే సహజము. వారి మాటలు,నడవడికను బట్టి మన మనసు కూడా వారి వైపు మల్లుతూ ఉంటుంది.కావున కచ్చితంగా ప్రతి ఒక్కరు మంచి వారితో స్నేహం చేయడం ఉత్తమం.
మంచి భోజనం..
దేవుడు యందు మంచు నిలిపేందుకు ఖచ్చితంగా సాత్వికాహారాన్ని తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు వేద పండితులు.మరియు మహిళలు మంచి మనసుతో,మంచి ఆలోచనలతో మాత్రమే ఆహారాలను వండాలని వల్ల, దానితో తినే వారు కూడా మంచి మనస్కులుగా తయారవుతారని చెబుతారు.అంతే కాక ప్రతి ఒక్కరి మనసు సాత్వికాహారము వలె మన మనసు ప్రశాంతంగా తయారవుతుందని చెబుతున్నారు.
కావున మీకు కూడా ఇలా పూజలు చేసే సమయంలో దేవుడిపై మనుసు నిర్దిష్టం కాక,చెడు ఆలోచన కలుగుతూ ఉంటే వెంటనే ఈ మూడు కారణాలపై ద్రుష్టి సారించడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: