శరీరంలోని రోగాలన్నిటికీ గోల్డెన్ మిల్క్ తో చెక్ పెట్టేయండి..!

Divya
మన శరీర ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పైనే 90% ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు.కానీ ఈ మధ్యకాలంలో చాలామంది జంక్ ఫుడ్ పైన ఆధారపడి, వారి ఆరోగ్యాన్ని మరింత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.ఇంక తీరా రోగాలు బారిన పడి,తినాల్సిన ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తోంది.అలా కాకుండా జంక్ పుడ్ కి దూరంగా ఉంటూ, కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడంతో శరీర ఆరోగ్యం మరింత మెరుగుపడి, వారి జీవనకాలం కూడా పెరుగుతుందని చెబుతున్నారు ఆహార నిపుణులు.ఆ కోవలోకి వస్తుంది గోల్డెన్ మిల్క్.రోజు రాత్రిపూట గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వల్ల సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. మరి ఆ గోల్డెన్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..
ఈ గోల్డెన్ మిల్క్ కోసం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి అందులో  నీరు కలపని ఒక గ్లాస్ పాలను పోయాలి.అందులోనే చిటికెడు పసుపు,అర స్ఫూన్ దాల్చిన చెక్క పొడి అరంగుళం అల్లం వేసి బాగా మరగనివ్వాలి.ఇలా మరిగిన పాలకు ఒక స్ఫూన్ తేనె కలిపి తీసుకోవాలి.ఈ గోల్డెన్ మిల్క్ ని రాత్రి పడుకోబోయే ముందు తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ పాలను తరుచూ తీసుకోవడంతో,ఇందులోని విటమిన్లు,మినరల్స్,మాంగనీస్,ఇనుము,పీచు, విటమిన్ బి6,కాపర్,పోటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.పసుపు యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది.దీనితో రోగ నిరోధక శక్తి పెరిగి,సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,జ్వరం వంటివి దరి చేరవు.ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
నిద్రలేమితో బాధపడేవారు రోజు ఈ పాలను పడుకోబోయే ముందు తీసుకోవడం వల్ల మెలటోనీన్ ఉత్పత్తి జరిగేలా చేసి,తొందరగా నిద్రకు ఉపక్రమించేలా సహాయపడుతుంది.మరియు దాల్చినచెక్కలో యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు అధికంగా ఉంటాయి.ఇవి పాలీఫెనాల్స్‌ గ్లూకోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలను తగ్గిస్తాయి.దీనితో బ్లడ్ షుగర్ లెవెల్స్‌‌ని అదుపులో ఉంచుకోవడంలో సహాయపడతాయి.మరియు అల్లం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది.అధిక బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది.
కావున ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిన గోల్డెన్ మిల్క్ తీసుకోవడం మీరు కూడా అలవాటు చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: