గులాబీ పెదాల కోసం గుమాలించే మాయిశ్చరైజర్ రాయాల్సిందే..?

Divya
ప్రతి మనిషిలో ప్రతి ఒక్కరిని ముందు ఆకర్షించేది నవ్వు మాత్రమే.మనం నవ్వితే మన ముందు వున్నవారు తిరిగి వెంటనే నవ్వుతారు.కొంతమంది పలకరింపు కూడా ఒక చిరునవ్వుతో చెబుతుంటారు.మరి అలాంటి నవ్వు అందమైన పెదవులతో నవ్వితే మరింత బావుంటుంది. కానీ కొంతమందికి పెదాలు అనేవి నల్లగా,పొడి బారిపోయి,పొరలు పొరలుగా ఊడిపోతూ అంద విహీనంగా ఉంటాయి.ఇంకా చలికాలం అయితే చెప్పనక్కర్లేదు.మనలో కొద్ది మందికి మాత్రమే పింక్ కలర్‌లో ఉంటాయి.చాలా మంది ముఖం మరియు శరీరంపై చూపించే శ్రద్ధ,పెదాలపై చాలా తక్కువ చూపిస్తారు.పెదాలను మాత్రం అస్సలు పట్టించుకోరు.ఇలాంటి వారికోసం,ఎలాంటి కెమికల్స్ లేని,మంచి హోమ్ రెమిడీస్‌ ఉపయోగించి గులాబీ పెదవులను సొంతం చేసుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు.అది ఎలా తయారు చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..
దీనికోసం ముందుగా గుప్పెడు గులాబీ రేకులను తీసుకొని,బాగా శుభ్రం చేసుకోవాలి.ఇప్పుడు 50 ml కొబ్బరి నూనె తీసుకుని,ఒక కడాయిలో పోసి స్టవ్ పై ఉంచాలి.ఈ కడాయిలో ఒక స్పూన్ కలబంద గుజ్జు,ఒక స్పూన్ దేశి నెయ్యి వేసి,బాగా మరగనివ్వాలి.ఇలా మరిగిన తర్వాత తిని వడకట్టుకోవాలి.అ తర్వాత ఇలా వచ్చిన మిశ్రమాన్ని గాలి చొరబడిని సీసాలో తీసుకొని ఫ్రిడ్జ్ లో ఒకరోజు పాటు ఫ్రీజ్ చేసుకోవాలి.
దీనిని ఇలాగే ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని,రోజు నిద్రపోయే సమయంలో పెదాలకు మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసుకోవాలి.ఇందులో వాడిన గులాబీ రేకుల వల్ల మాయిశ్చరైజర్ మంచి గుబాలించే స్మెల్ వస్తూ ఉంటుంది.అంతేకాక రోజు దీనిని నల్లటి పెదాలపై అప్లై చేయడం వల్ల,ఇందులో వాడిన కొబ్బరి నూనెకు చర్మంపై ఉన్న నలుపును ఎక్స్పోలియేట్ చేసె గుణం ఉంటుంది. దీనితో పెదవులు క్రమంగా నలుపుదలన్ని కోల్పోయి, ఎరుపు రంగును సంతరించుకుంటాయి.మరియు కలబంద గుజ్జు,నెయ్యి పెదవులకు హైడ్రేషన్ నందించి పొడిబారకుండా కాపాడుతాయి.
దీనిని ఎటువంటి సందేహం లేకుండా చిన్న పిల్లలు సైతం ఉపయోగించుకోవచ్చు.మరియు తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మాయిశ్చరైజర్ ఇంతకంటే మనకు లభించదు.కావున మీరు కూడా గులాబీ రంగు పెదాలను పొందాలంటే,వెంటనే ఈ మాయిశ్చరైజర్ తయారు చేసి,ఉపయోగించడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: