ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీల పనితీరు చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మన కిడ్నీలు సరిగ్గా పనిచేస్తేనే అన్ని జీవక్రియలు కూడా ఖచ్చితంగా సక్రమంగా జరుగుతాయి.అయితే మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల వల్ల ఈ రోజుల్లో కిడ్నీల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ముఖ్యంగా మారిన జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న లైఫ్ స్టైల్ వల్ల కిడ్నీలు అనారోగ్యం బారిన పడుతున్నాయి. అయితే కిడ్నీల సమస్యలను కొన్ని లక్షణాల ద్వారా మనం ముందుగానే గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మూత్ర పిండాలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా మూత్ర విసర్జనపై ప్రభావం పడుతుంది. అధికంగా మూత్ర విసర్జన వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మూత్రంలో రక్తం పడినా వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ లక్షణం కూడా మూత్ర పిండాలు పనితీరు దెబ్బతిందని అర్థం చేసుకోవాలి.మూత్ర పిండాల పనితీరు దెబ్బతింటే చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మం పొడిబాడరం, దురద వంటి సమస్యలు వస్తాయి.అలాగే కిడ్నీల్లో సమస్యలు ఏర్పడినప్పుడు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీంతో శరీరంలోని మలినాలు బయటకు రావు. ఇది కాలక్రమేణ నిద్రలేమి, ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.మీ కిడ్నీల్లో సమస్యలు ఏర్పడినప్పుడు రక్తంలో విషపదార్ధాలు క్రమంగా పేరుకుపోతాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు చాలా త్వరగా అలసిపోతారు. అదే సమయంలో, కొంచెం నడిచినా కూడా బలహీనంగా మారుతారు. కిడ్నీ వ్యాధి రక్తహీనత, అలసట, బలహీనతకు దారి తీస్తుంది.మన శరీరంలో కిడ్నీలని చాలా ముఖ్యమైన అవయవాలుగా చెప్తారు. ఎందుకంటే రక్తం నుండి వ్యర్థాలను, టాక్సిన్‌లను ఫిల్టర్ చేసి.. వ్యర్థాలను బయటకు పంపించే ముఖ్యమైన విధి నిర్వహిస్తుంది. ఈ మూత్ర పిండాలు సరిగ్గా పని చేయకపోతే.. వ్యర్థాలు బయటకు రాకుండా శరీరంలోనే ఉండి పోతాయి. దీంతో అనారోగ్య సమస్యల ముప్పు తప్పదు.