ఈ పండు ఆకులతో ఏ జబ్బు రాదు?

Purushottham Vinay
నేరేడు పండ్లు ఎంత రుచికరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పండ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్‌, మాంగనీస్‌, పొటాషియం, పాస్పరస్‌, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి.ఇందులోని ఎన్నో పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.నేరేడు ఆకులతో కూడా ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.తీవ్ర జ్వరంతో బాధపడేవారికి కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల రసంలో ధనియాలు వేసి తీసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది.కాలేయం పనితీరు మెరుగుపరచడంలో నేరేడు ఆకలు ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల కషాయంను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.అధిక మల విసర్జన సమస్యతో బాధపడే వారికి నేరేడు ఆకులు ఉపయోగపడుతాయి. నేరేడు ఆకులను కషాయంగా చేసుకొని తీసుకుంటే ఫలితం ఉంటుంది.


నేరేడు ఆకులను ఎండబెట్టి పొడి చేసి అందులో ఉసిరికాయ పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంతోపాటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోపడుతుంది.నేరేడు ఆకులను మెంతి గింజలతో ఉడకబెట్టి తసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో కూడా ఇది సహాయపడుతుంది.నేరేడు పండ్లు జున్‌, జూలై మధ్య పండుతాయి. అయితే ఆకులు మాత్రం ఏడాది పొడవునా తినొచ్చు. ఆకులను నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయానికి చెక్‌ పెట్టడంలో నేరేడు ఆకులు ఎంతగానో ఉపయోగపడుతాయి.నేరేడు ఆకుల్లోని ఆకులు యాంటీఆక్సిడెంట్స్‌, యాంటీ-వైరస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లోని పోషక విలువలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, మలబద్ధకం, అలెర్జీలను తొలగించడంలో ఉపయోగపడుతాయి. నేరేడు ఆకులు హార్మోన్ల రొమ్ము క్యాన్సర్ నివారణపై , బెర్రీలలో ఉండే ఆంథోసైనిన్‌లు శరీరంలో యాంటీకాన్సర్ కణాలను పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: