బాదం ఎక్కువ తింటే కలిగే నష్టాలు?

Purushottham Vinay
బాదం పప్పు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో అందరికి తెలిసిందే. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి చాలా పుష్కలంగా లభ్యమవుతాయి. అందుకే ప్రతి రోజూ బాదం పప్పు తింటే ఖచ్చితంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యల్ని మనం దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు  చెబుతూ ఉంటారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ గింజలు తింటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.అయితే బాదం పప్పు ఎక్కువగా తింటే మాత్రం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఎందుకంటే దీన్ని అతిగా తింటే ప్రయోజనాలకు బదులుగా.. ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.బాదం పప్పు ఎక్కువగా తింటే కొందరిలో అలర్జీ  వస్తుంది. దద్దుర్లు, ముఖంపై వాపు, దురదలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.బాదంలో వివిధ రకాల పోషకలు, ఖనిజాలు ఉంటాయి. వీటిని మితంగా తీసుకుంటే వాటి శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి. వాటి లోపం లేకుండా చేస్తాయి.ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఖనిజాల లోపం ఏర్పడుతుంది.



బాదం పప్పు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ఇందులో కేలరీలు, కొవ్వ ఉంటాయి కాబట్టి.. వెయిట్ పెరిగేందుకు కారణం అవుతాయి. అలాగే బాదంలో ఆక్సలేట్ ఉంటుంది. దీని వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీ సమస్యలు కూడా తెలెత్తవచ్చు.బాదం పప్పులో విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది మితంగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందిచర్మం, కళ్లు ఆరోగ్యంగా పని చేస్తాయి. అయితే ఎక్కువగా బాదం తీసుకుంటే ఇందులో విటమిన్ ఇ వల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలు సంభవించవచ్చు.కాబట్టి బాదం పప్పు ఎక్కువగా కాకుండా కేవలం మితంగా మాత్రమే తీసుకోండి. మితంగా తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: