రేగుపండ్లు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇవి పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. అందుకే వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు..ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు.కొందరికి అస్సలు నిద్రపట్టదు. చివరకు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సరైన పండ్రు రేగు పండ్లు. నరాలను శాంతపరచడం ద్వారా ఇవి మనం నిద్రపోయేలా చేయగలవు. టెన్షన్, ఒత్తిడి వంటివి తగ్గాలంటే కూడా రేగుపండ్లు తినాలి.ఈ పండ్లు రక్తాన్ని బాగా శుభ్రం చేస్తుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి కూడా బాగా సహాయపడతాయి. రేగులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడుతుంది.
మన శరీర ఆరోగ్యానికి ఈ రేగు పండ్లు బాగా ఉపయోగపడతాయి. పైగా ఇవి తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లు.ఇవి ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో... మన శరీరం జీర్ణ ప్రక్రియను బాగా మెరుగుపరుస్తాయి.ఇంకా పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా రేగు పండ్లు తినడం మంచిది.ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. మన ఎముకలు దృఢంగా, గట్టిగా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినిపించడం సరైన పరిష్కారం. ఈ పండ్లు తింటే మంచిది వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు... కీళ్ల మంటల్ని చల్లబరుస్తాయి.రేగు పండ్లు... పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ మనల్ని కాపాడతాయి రేగు పండ్లు. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి చాలా అవసరం.