మొలల సమస్య చిటికెలో తగ్గే చిట్కాలు?

Purushottham Vinay
మొలల సమస్య ఇంకా నొప్పితో బాధపడే వారు ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే చిటికెలో ఉపశమనం పొందుతారు. ఒక వస్త్రంలో ఐస్ క్యూబ్స్ వేసి మొలలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే టబ్ బాత్ చేయడం వల్ల మొలల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మలం ద్వారం వద్ద మొలలతో పాటు గాయం, రక్తం కారడం వంటి ఇతర సమస్యలతో బాధపడే వారు ఆ భాగంలో గాయాలపై, మొలలపై స్వచ్ఛమైన తేనెను రాయాలి. ఇలా రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. ఆ భాగంలో ఉండే క్రిములు నశిస్తాయి.మలవిసర్జన సరిగ్గా కాకుంటే మొలల సమస్య వస్తుంది కాబట్టి మలవిసర్జన సులభంగా అవ్వడానికి ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా ఆకుకూరలు, తృణ ధాన్యాలను ఖచ్చితంగా తినాలి. ఇంకా అలాగే కూరగాయలను తొక్కతో వండుకుని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ అనేది లభిస్తుంది. అందువల్ల మలబద్దకం సమస్య పూర్తిగా తగ్గుతుంది.



అలాగే సాయంత్రం సమయంలో పండ్లను తొక్కలతో తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. మొలల సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. లేని వారికి రాకుండా ఉంటుంది.అలాగే 8 నుండి 10 రోజుల పాటు వరుసగా ఎనిమా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గట్టి పడిన మలం సులభంగా బయటకు పోతుంది. అలాగే రోజూ ఉదయం పరగడుపున లీటర్నర నీటిని తాగాలి. ఒక గంట తరువాత మరలా ఒక లీటర్ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల రెండు సార్లు మలవిసర్జన జరుగుతుంది. దీంతో మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.ప్రతి రోజు ఖచ్చితంగా నీళ్లు ఎక్కువగా తాగండి.మజ్జిగ కూడా తాగండి. వీటి వల్ల ఆ సమస్య రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఈజీగా తగ్గిపోతుంది.ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మొలల సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: