తల నొప్పి అనేది అసలు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. ఇది సడెన్ గా ఎటాక్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల అసలు మనం చేస్తున్న పని మీద ఏకాగ్రత పెట్టలేరు. దేని మీద కూడా ధ్యాస అనేది ఉండదు. తల నొప్పి వల్ల మన మైండ్ సరిగ్గా పని చేయదు.తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి.ఇక ఈ తలనొప్పిని క్షణాల్లో తరిమి కొట్టాలంటే.. ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి.అయితే మనం ఐస్ ప్యాక్ తో తల నొప్పిని తగ్గించు కోవచ్చు. నుదురపై కాసేపు ఐస్ క్యూబ్ తో రుద్దితే తల నొప్పి అనేది ఎగిరి పోతుంది. కొబ్బరి నూనెతో కూడా తల నొప్పిని తగ్గించు కోవచ్చు. కొబ్బరి నూనె తలపై రాసుకుని.. సున్నితంగా మర్దనా చేసుకుంటే తల నొప్పి అనేది మాయం అవుతుంది.తల నొప్పిగా ఉన్నప్పుడు తలకి గంధం రాయండి. ఎందుకంటే గంధంలో శీతలీకరణ ప్రభావం ఉంటుంది. గంధం పేస్ట్ రాయగానే.. తలకు విశ్రాంతి ఇచ్చి.. మెదడును రిలాక్స్ చేస్తుంది.
ఇక తల నొప్పి రాగానే చాలా మంది కాఫీ, టీలు తాగుతారు. వాటికి బదులు గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీలో కాస్త తేనె వేసుకుని తాగితే.. తల నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే పసుపు పాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గోరు వెచ్చగా ఉండే పాలల్లో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే రిలీఫ్ గా ఉంటుంది.తల నొప్పి వస్తే ఏం చేయాలో చాలా మందికి తెలీదు. తలనొప్పి వస్తే ముందు మీరు రిలాక్స్ అవ్వండి. కళ్లు మూసుకుని మీ నుదుటి మీద నుంచి చుట్టు పక్కల వరకూ సాఫ్ట్ గా మసాజ్ చేసుకోండి. తరువాత కళ్లు మూసుకుని.. కాసేపు పక్కకు కూర్చోండి. ఇలా చేస్తే తల నొప్పి నుంచి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది. వీలైనంత వరకు ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ టిప్స్ పాటించండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇక తలనొప్పి వచ్చినప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు వాడటం పూర్తిగా ఆపేయండి. ఏవైనా కాల్స్ వస్తే అస్సలు మాట్లాడకండి.