గొంతులో కఫం వేదిస్తోందా..?అయితే ఈ టీ తో పారద్రోలండి..!

Divya
సాధారణంగా చాలా మందికి చలికాలం వచ్చే చల్లగాలులకు దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.వీటిని తగ్గించుకోవడానికి రకరకాల మాత్రలు,మందులు వాడటంతో తగ్గిపోయినప్పటికీ గొంతులో కఫం చేరి,నసనస అంటూ ఉంటుంది.దీని తీవ్రతను బట్టి వారం నుంచి పది రోజుల వరకు వేధించే అవకాశం ఉంటుంది.ఇది అస్తమా,సైనస్ ఊపిరితిత్తుల సమస్యలు వున్నవారికి మరింత వేదిస్తూ ఉంటుంది.ఇలాంటి వారికి చిట్టి లవంగాల టీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అస్సలు ఆ లవంగాల టీ ఎలా తయారు చేసుకోవాలో, అది కాఫాన్ని ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం పదండీ..

ఈ టీ కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకుని,స్టవ్ పై పెట్టి బాగా మరిగించాలి.ఇప్పుడు అర అంగుళం అల్లం, చిన్న దాల్చిన ముక్క,ఓ మూడు లవంగాలు వేసి, రంగు మారేంత వరకు మరిగించుకోవాలి.ఇవి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి, వడకట్టి,ఒక గ్లాస్ లోకి తీసుకుని,గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో ఒక స్ఫూన్ తేనె కలుపుకుని మెల్లగా ఆస్వాదిస్తూ తాగాలి.

ఇలా మెల్లగా తాగడం వల్ల గొంతులోని చెడు బ్యాక్టిరియా నశింప చేసి,కఫాన్ని విరిచే శక్తి ఈ టికీ ఉంది.దీన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల కఫం అంతా కరిగి,గళ్ళు రూపంలో బయటకు వచ్చేస్తుంది.ఈ లవంగాల టీలో యాంటీ వైరల్,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కళంగా లభిస్తాయి.దీంతో జలుబు,దగ్గు, జ్వరం అనేవి వారం లోపు తగ్గుముఖం పడతాయి.అంతేకాక మలబద్ధకం,గ్యాస్,కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా నివారణ కలుగుతుంది.


ఈ టీని సైనస్,ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడేవారు కూడా తరచూ తీసుకోవడంతో,గొంతులో వెచ్చదనం కలిగి,ఉపశమనం లభిస్తుంది.ఈ లవంగాల టీ తీసుకుంటున్నప్పుడు కాకర కాయలతో, పుదీనా,అల్లంతో తయారు చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో కూడా కఫాన్ని తగ్గించే శక్తి విరివిగా ఉంటుంది.అంతే కాక ఈ లవంగాల టీ తీసుకోవడం వల్ల వికారం,అజీర్తి,వికారం, వాంతులు వంటివి కూడా రాకుండా నివారించుకోవచ్చు.

కావున మీరు కూడా చలికాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే,ఈ టీ ని తప్పకుండా తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: