దంతాలు మిలమిల మెరవాలంటే మిరియాలతో ఇలా చేసి చూడండి..!

Divya
సాధారణంగా మన ముఖం అందం మన చిరునవ్వుపై ఆధారపడి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాంటి చిరునవ్వును కొంతమంది చిగురించలేకపోతున్నారు.దానికి కారణం వారి పంటి ఆరోగ్యం దెబ్బతిన్నడమే.కొంతమందికి పళ్ళు పసుపచ్చగా మారడం,పాచి పట్టుకోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే,ఇంకొంతమంది గార పట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు.అటువంటి వారికి ఎలాంటి టూత్ పేస్ట్ వాడినా ఎటువంటి ప్రయోజనము కలగకపోగా ఇంకొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.అలాంటి వారి కోసమే మన వంటింట్లో దొరికే నాచురల్ పదార్థాలతో తయారు చేసే చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.అసలు మిరియాలు పళ్ళను ఏ విధంగా మెలమెలా మెరిసేలా చేస్తాయో మనము తెలుసుకుందాం పదండీ..

దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 100 గ్రామ్స్ మిరియాల పొడి,100 గ్రామ్స్ లవంగాలు,ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని గాజు సీసాలో ఉంచి టైట్ గా మూత పెట్టి భద్రపరుచుకోవాలి.ఈ మిశ్రమాన్ని పళ్ళు తోమే ముందు చిటికెడు పక్కకు తీసి,అందులో ఒక స్పూన్ నువ్వుల నూనె కలిపి,బ్రష్ తో అద్దుకొని,సాధారణంగా బ్రష్ చేసుకున్నట్టే చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల ఎటువంటి గారైన,పాచయిన తొందరగా వదిలిపోతుంది.

ఇందులో వాడిన మిరియాలు మరియు లవంగాల వల్ల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు డెవలప్ అవుతాయి.వీటి వల్ల నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా మొత్తం చనిపోయి క్యావిటీస్ కలగకుండా దూరం చేస్తాయి.అంతేకాక తీవ్రమైన పంటి నొప్పి ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.మరియు వీటితోపాటు ఏదైనా తినడం కాఫీ తాగడం కానీ చేసిన తర్వాత నోటిని ఖచ్చితంగా పుక్కలించడం అలవాటు చేసుకోవాలి.దీనివల్ల మనం తిన్న పదార్థాలు ఏవైనా పళ్ళ సందులో ఇరుక్కుపోతే వెంటనే బయటికి వస్తాయి. అలా చేయలేదంటే అక్కడే ఉండిపోయిన పదార్థాలపై  చెడు బ్యాక్టీరియా చేరి క్యావిటీస్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే చిట్కా తప్పక వాడి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: