వర్షాకాలంలో వచ్చే దురదలను పోగొట్టే ఇంటి చిట్కాలు ఏంటో తెలుసా..?
1).కొబ్బరి నూనె..
పూర్వం రోజుల్లో ఎలాంటి చర్మ సమస్యలైనా వెంటనే కొబ్బరి నూనె రాసేవారు ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఎటువంటి దురదలను పుండ్లను అయినా చిటికలోఉపశమనం కలిగిస్తాయి కనుక.కావున ఇలా మొదలతో బాధపడేవారు ఆ పుండ్లపై గోరువెచ్చని కొబ్బరి నూనెను రాయడం వల్ల తొందరగా తగ్గుముఖం పడతాయి.
2).కలబంద గుజ్జు..
అతి దురదలపై కలబంద గుజ్జు రాయడం వల్ల కూడా చర్మ సమస్యలను తొలగించుకోవచ్చు.ఇంకా చెప్పాలి అంటే కాలిన గాయాలను మానడంలో కూడా కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
3).వోట్ మిల్ బాత్..
అతి దురదలతో బాధపడేవారు ఓట్స్ ని నానబెట్టి ఆ వాటర్ తో స్నానం చేయడం వల్ల,చర్మానికి హైడ్రేషన్ కలిగించి,దురదలు తగ్గుముఖం పట్టేందుకు సహాయపడుతుంది.
4).ఆపిల్ సిడర్ వెనిగర్..
ఎవరైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చిన వారు ఒక కాటన్ బాల్ తీసుకొని,ఆపిల్ సైడర్ వెనిగర్ ని అద్దుకొని ఆ ఇన్ఫెక్షన్లపై రాయడం వల్ల, ఇందులోని అసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు ఫంగస్ ను చంపేస్తుంది.దీనితో దురదలు తొందరగా తగ్గుముఖం పడతాయి.
5).సోడా ఉప్పు..
వంటల్లో వాడే సోడా ఉప్పు కూడా దురదలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.చిటికెడు సోడా ఉప్పును తీసుకొని వాటిపై చల్లడం వల్ల కూడా దురదలు తొందరగా తగ్గుతాయి.
మీరు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే, ఈ నివారణలు తప్పక పాటించండి.