ఈ ఆయిల్ వాడితే ఏ సమస్య రాదు?

Purushottham Vinay
మనం ప్రతి రోజూ తినే ఆహారంలో నట్స్ కూడా ఒకటి.ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతీ ఒక్కరి డైట్ లో కూడా నట్స్ అనేవి ఉంటున్నాయి. నట్స్ తో శరీరానికి ఉపయోగపడే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.ఇక వీటిల్లో ఒకటి వాల్ నట్స్ ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వాల్ నట్స్ ని ఏ రూపంలో తీసుకున్నా కూడా పోషకాలు మాత్రం బాగానే అందుతాయి.వీటిల్లో ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పీచు పదార్థాలు ఇంకా విటమిన్ బి చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాల్లో వాల్‌ నట్స్ కూడా ఒకటి. అయితే కేవలం వాల్ నట్స్ కన్నా వాల్ నట్స్ ఆయిల్ లోనే ఇంకా ఎక్కువ మంచి పోషక విలువలు ఉన్నాయి. మరి ఈ ఆయిల్ వాడకం వల్ల లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మనం ఈ వాల్ నట్స్ ఆయిల్ ను జుట్టుకు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు పోషణ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఓమేగా-3 ప్యాటీ యాసిడ్స్ దీనికి సహాయం చేస్తాయి. ఇక జుట్టు డ్రై గా ఉందని బాధపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే జుట్టు కూడా పెరుగుతుంది.అలాగే ఈ వాల్ నట్స్ ఆయిల్ తో క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. ప్రతి రోజూ మీరు తినే ఆహారంలో వాల్ నట్స్ ఆయిల్ ను చేర్చడం ద్వారా.. రొమ్ము క్యాన్సర్, కొలెస్ట్రాల్ క్యాన్సర్ ను ఈజీగా తగ్గించవచ్చు.ఇక వాల్ నట్స్ తో చర్మం కూడా ఫ్రెష్ గా, యవ్వనంగా ఉంటుంది. ఇది వృద్ధాప్య ఛాయలను తొందరగా రానివ్వదు. ఓ రెండు మూడు చుక్కలు ఈ ఆయిల్ ని తీసుకుని ఫేస్ కి బాగా మసాజ్ చేసుకుంటే చాలా మంచిది.అలాగే ఈ వాల్ నట్ నూనెను ప్రతి రోజూ ఆహారంలో ఉపయోగిస్తే..షుగర్ వచ్చే ప్రమాదంని ఈజీగా తగ్గించవచ్చు. ఇది ఖచ్చితంగా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: