స్పేస్ లో వ్యోమగాములు మరణిస్తే.. మృతదేహాన్ని ఏం చేస్తారు?

frame స్పేస్ లో వ్యోమగాములు మరణిస్తే.. మృతదేహాన్ని ఏం చేస్తారు?

praveen
సాధారణంగా స్పేస్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు నిరసిస్తూ ఇక అంతరిక్షం గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఎప్పటికప్పుడు ఎన్నో విషయాలు అప్పుడప్పుడు తెర మీదికి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతు ఉంటాయి. అయితే ఒకప్పుడు అటు స్పేస్ కి సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికి తెలిసేవి కాదు. స్పేస్ లోకి వెళ్ళిన వ్యోమగాముల జీవన శైలి ఎలా ఉంటుంది అన్న విషయం కూడా చాలామందికి తెలిసేది కాదు.
 కానీ ఇటీవల కాలంలో అంతరిక్షం నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక స్పేస్ లోకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ ఎలాంటి జీవితాన్ని గడుపుతారు  వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న విషయాన్ని ఇక ఆయా సినిమాల ద్వారా ఎంతో మంది సామాన్యులు సైతం తెలుసుకోగలిగారు. అయితే సినిమాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పటికీ ఇక స్పేస్ లో జరిగే మరికొన్ని విషయాలు మాత్రం అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

 అంతరిక్ష యాత్రకు వెళ్లిన తర్వాత కొన్ని కొన్ని సార్లు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇలా స్పేస్ లో వ్యోమగాములు మరణిస్తే వారి మృతదేహాన్ని ఏం చేస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఇలా చనిపోయిన వ్యోమగాముల మృతదేహాన్ని స్పేస్ క్యాప్సిల్ ద్వారా భూమికి తీసుకు రావచ్చు. అయితే దానిలో మృదేహాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక గది ఉంటుందట. అయితే అంతరిక్ష కేంద్రం భూమికి దగ్గరగా ఉన్న కక్షలో మరణం సంభవిస్తే రోజుల వ్యవధిలో డెడ్ బాడీని తీసుకురావచ్చట. అయితే చంద్రుడు పై ఇలా ఎవరైనా వ్యోమగాములు ప్రాణాలు వదిలితే భూమ్మీదికి మృద్దేహాన్ని తీసుకొచ్చేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందట. అదే అంగారకుడు పై ఇలాంటి ఘటన జరిగితే ఇక మిషిన్ పూర్తయ్యేంత వరకు కూడా మృతదేహాన్ని భద్రపరిచి అప్పుడు భూమ్మీదికి తీసుకు వస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: