ముఖమంతా ఈవెన్ టోన్ రావాలంటే ఈ ప్యాక్ వేసుకుంటే చాలు..!
ఈ ప్యాక్ కోసం కావాల్సినవి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి,రెండు టీ స్పూన్ల రాగి పిండి,చిటికెడు పసుపు,అర కప్పు కలబంద గుజ్జు.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పైన చెప్పిన ఇంగ్రిడియంట్స్ అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.తరువాత ఈ ప్యాక్ పెట్టుకోవడానికి ముందే ఫేస్ వాష్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలి.ఇప్పుడు ఈ ప్యాక్ వేసుకొని అరగంటసేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన తర్వాత నీళ్లతో తడిపి మరీ మెల్లగా మర్దన చేసుకోవాలి.ముఖ్యంగా మెడ పై నలుపుదల ఉంటుంది కావున ఆ ప్రదేశంలో బాగా మర్దన చేయాలి.ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల ముఖం మెడ ఈవెన్ టోన్ గా కనిపిస్తాయి.
ఈ ప్యాక్ లో వాడిన శనగపిండి వల్ల,ముఖంపై ఉన్న మృతకణాలు,జిడ్డు తొలగిపోయి ముఖం ఈవెన్ టోన్ గా మారుతుంది.మరియు రాగిపిండిలో ఉన్న ఐరన్ గుణాలు,చర్మంలోకి ఇంకిపోయి,రక్తసరఫరాను పెంచి, చర్మం ఈవెంట్ ఆన్ గా మారేందుకు ఉపయోగపడుతుంది.కావున మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి.ముఖ్యంగా చర్మ ఆరోగ్యం కాపాడుకోవాలంటే,రోజుకు మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం చాలా ఉత్తమం.