ఇక ఏ కులస్తుడైనా.. పూజారి కావచ్చు?

ఆలయాల్లో పూజారులు అంటేనే సాధారణంగా బ్రహ్మణులు ఉంటారని అందరికీ తెలిసిందే. కానీ మద్రాస్ హైకోర్టు ఇటీవల ఒక కేసు విషయంలో సంచలన తీర్పు నిచ్చింది. ముఖ్యంగా పూజారులు అంటే జంధ్యం వేసిన వారు కాదు, ఆగమ శాస్త్రం తెలిసి, వేద విద్యలు తెలిసిన ఎవరైనా ఆలయాల్లో అర్చకులుగా ఉండవచ్చని తెలిపింది. శ్రీకాళహస్తి ఆలయంలో భక్త కన్నప్ప వారసులు అర్చకులుగా ఉంటారు. వారు గిరిజన తెగలకు చెందిన వారు. సింహచలం ఆలయంలో కూడా ఇలాంటి అర్చకులు ఉన్నారు.


జంధ్యం వేసుకున్న వారందరూ బ్రహ్మణులు కాదు. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ఆలయాల్లో గిరిజన తెగలకు చెందిన వారు పూజలు చేసే వారున్నారని, అలాగని ప్రతి ఒక్కరూ చేయడం కాదు. ఆగమ శాస్త్రం చదువుకుని పూజా విధానాలు తెలిసిన వారు ఆలయాల్లో అర్చకులుగా చేయొచ్చని మద్రాస్ హై కోర్టు తీర్పునిచ్చింది.


అన్ని కులాల వారు అర్చకులుగా చేయొచ్చని తెలిపింది.  బ్రహ్మణులే అర్చకత్వం చేయాలని ఏమీ లేదని చెప్పింది. బ్రహ్మణులే అర్చకులుగా చేయాలని చెప్పడం సరికాదని పేర్కొంది. దీంతో కొంత మేర వివాదం నెలకొనేలా ఉంది. ముఖ్యంగా దేశంలో కులాలు, మతాల ప్రాతిపదికన కొన్ని పనులు చేస్తుంటారు. కుల వృత్తుల ఆధారంగా బతుకున్న భారత్ లో ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం వల్ల సదరు కుల వృత్తి చేసుకునే వారికి దెబ్బ పడుతుంది.


బ్రాహ్మణ జాతిలో అర్చకులుగా చేయడం అనేది వారు వృత్తిగా భావిస్తారు. దేవుడికి, భక్తులకు అర్చకులు మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. కానీ అర్చకత్వం అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చనే విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దానికి కచ్చితమైన విధానాలు తీసుకురావాలి. అర్చక వృత్తి చేపట్టే వారికి ఉండాల్సిన నిబంధనలు కచ్చితంగా తెలియ జేయాల్సి ఉంటుంది. దీనికి పాటించాల్సిన ఆచారాలు, నియమాలు, నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే అర్చక వృత్తి చేయాలని పెడితే సరిగా ఉంటుందని పలువురి అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: