క్యాల్షియం లోపం తగ్గిపోవాలంటే ఇది తాగితే చాలు..!!
కాల్షియం రిచ్ పౌడర్ ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మఖాన తీసుకొని,బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.అదే బాండీలో గుప్పెడు బాదాంలు, వేసి బాగా వేయించిన తర్వాత,అందులోనే రెండు టీ స్పూన్ల గసగసాలు,రెండు టీ స్పూన్ల గుమ్మడి విత్తనాలు, రెండు టీ స్పూన్ల కాజు,ఐదారు ఎండు ఖర్జూరాలలో విత్తనాలు తీసి,వేయాలి.వీటన్నిటినీ వేసిన బాండీలోనే రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా వేయించాలి.ఇవన్నీ బాగా వేగిన తర్వాత,చల్లారనివ్వాలి.ఆ తరువాత వీటన్నిటి కలిపి బాగా పౌడర్ లాగా తయారు చేసుకుని, గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే ఒక నెల రోజులపాటు వాడుకోవచ్చు.దీనిని రోజూ ఉదయాన్నే కాఫీ,టీలకు బదులుగా పాలలో వేసి కలుపుకొని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది.
ముఖ్యంగా మఖాన క్యాల్షియంకు భాండాగరమని చెప్పవచ్చు.మరియు ఇందులో వాడిన ప్రతి పదార్థంలోనూ క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల,మన శరీరంలో ఉన్న కాల్షియం డెఫిషియన్సీని దూరం చేస్తాయి.కావున చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలలో ఈ పౌడర్ ని కలుపుకొని తాగడం ఉత్తమం.మరియు ముఖ్యంగా పిల్లలకు రోజు ఈ పౌడర్ కలిపిన పాలు ఇవ్వడం వల్ల,అవి వారి బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగేందుకు దోహదపడుతుంది.
మరియు క్యాల్షియం డేపిషియన్సీతో బాధపడేవారు రోజు ఒక అరగంట పాటు ఎండలో ఉండడం చాలా ముఖ్యం.దీనికి కారణం మనకు సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ మనం తిన్న ఆహారం నుంచి కాల్షియం అబ్జర్వ్ చేసుకుని,శరీరానికి అందివ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.కావున ఒక అరగంట పాటు ఎండలో వాకింగ్ కానీ,వ్యాయమాలు కానీ చేయడంతో కూడా క్యాల్షియం డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు.