పిల్లలు గోల్డెన్ చైల్డ్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా..?

Divya
ఇంత ఇంత టెక్నాలజీ పెరిగిన తరుణంలో కూడా తల్లిదండ్రులు తమ బిడ్డలు అందరూ తమకు సమానమే అని చెప్పుకోస్తున్నా కూడా కొన్ని అధ్యాయాలు ప్రకారం పేరెంట్స్ కి మొదటి బిడ్డని గోల్డెన్ చైల్డ్ అవుతుందని తెలుపుతున్నారు.దీనిని ఏ తల్లిదండ్రులైన ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా పిల్లలలో ఎవరో ఒకరు గోల్డెన్ చైల్డ్ అయి ఉంటారు.దీని ప్రభావం ఆ పిల్లలపై పడి,గోల్డెన్ చైల్డ్ సిండ్రోమ్ తో బాధపడుతూ ఉంటారు.
అసలు గోల్డెన్ చైల్డ్ అంటే తల్లిదండ్రులు ఒక పిల్లవాడి పైనే వారి ఆశలు ఆశయాలు రుద్దుతూ,వారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి,వారు చేసిన ప్రతి పనిని పోగొట్టడం,సహోదరులతో గొడవ జరిగినప్పుడు వారినే వెనుక వేసుకుని రావడం,ఏమి తెచ్చిన ఇద్దరికీ సరి సమానంగా పంచినా,కొంచెం అయినా ఒకరికె ఎక్కువగా ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల ఇంకో బిడ్డపై చాలా తీవ్రమైన చెడు ప్రభావాలను కలిగిస్తుందని,శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.
ఇది పిల్లలకు డిపెండెన్సీ భావాన్ని పెంచుతుంది. మరియు తల్లిదండ్రులు ఒకె బిడ్డపై అధిక అంచనాలను కలిగి ఉండటంతో వారి గోల్స్ సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.దీనితో గోల్డెన్ చైల్డ్ పిల్లలు తల్లితండ్రుల అంచనాలను అందుకోవాలని,అధిక ఒత్తిడికి గురవుతారు.దీనితో సొంత సవాళ్లు,భావోద్వేగ భారాలను మోయాల్సి వస్తోంది.తల్లిదండ్రుల వారి గోల్డెన్ చైల్డ్ గా భావించే పిల్లలను వారి సహోదరులు వేరుగా చూడటం మొదలుపెడుతారు.ఇలా చేయడం వల్ల కుటుంబంలో హెచ్చుతగ్గులు మొదలవుతాయి.
ఇలాంటి పిల్లలకు బలహీనమైన ఆత్మగౌరవాని పెంపొందించుకుంటారు.తరుచూ వారు ప్రశంసల జల్లులో ఉండేవారు,ఎప్పుడైనా కొంచెం విమర్శ వచ్చినా తట్టుకోలేరు.దానితో వారి కోరికలను,నిజాలను కప్పివేయబడవచ్చు.వ్యక్తిగత గుర్తింపు పెంపొందించడంలో కష్టపడవచ్చు.వారికి రాని విషయాలలో విజయం పొందడానికి,అవాస్తవ అంచనాలను పొందడానికి అధిక ఒత్తిడి కలిగి ఆందోళన, వైఫల్య భయం వెంటాడుతుంది.రిస్క్ చేసేందుకు,కొత్త అవకాశాలను వెతికేందుకు బయపడి ఒకటే ధోరణిలో వుంటారు.కావున తల్లి తండ్రులారా మీరు ఇలా పిల్లల్ని పెంచుతున్నారేమో గమనించుకోండి.లేదంటే మీ ఆశలు ఆశయాల ప్రభావం మీ పిల్లలపై పడి లేనిపోని మానసిక లోపాలు ఎదుర్కోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: