పెరట్లో ఇలాంటి చెట్లు పెరిగాయంటే అంతే సంగతులు..?
ఇంటి పెరట్లో పెంచకూడని మొక్కలివే..
1).ముళ్ల మొక్కలు:
ముళ్ళ మొక్కలు ఇంటి పెరట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా గులాబీ, కాక్టస్, నిమ్మ వంటి చెట్లను ఇంటి ఆవరణలో లేదా ఇంటి లోపల పెంచుకోకూడదు.ముళ్ల మొక్కలు కొట్లాటలకు,ద్వేషానికి ప్రతీక.ఇటువంటి మొక్కలను పెంచుకోవడం వల్ల అ ఇంట్లో మనస్పర్థలు, కలహాలు వచ్చి కుటుంబమే నరకంగా మారుతుంది. కాబట్టి, ఇంటి ముందు అలాంటి మొక్కలను పెంచుకోకపోవడం చాలా ఉత్తమం.
2).చింతచెట్టు:
వాస్తుశాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ ఉండకూడదు. చింతపండు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుంది. శత్రుత్వం తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఇంటి ముందు చింతచెట్టును నాటకండి.
3).ఖర్జూరం:
ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ హిందూ సంస్కృతిలో ఇది చాలా చెడు ప్రభావాలకు సంకేత మొక్కగా భావించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఖర్జూర చెట్టును ఇంటి ముందు పెంచుకోవడం వల్ల, ఇంట్లోని వారికి అశుభాలు కలుగుతాయని చెబుతారు.అంతే కాక వారూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.కావున ఖర్జూరం మొక్కలను అస్సలు పెంచకండి.