పసుపుని ఇలా వాడితే బోలెడు ప్రయోజనాలు?

Purushottham Vinay
పసుపు వల్ల వంటకాలకు చాలా మంచి రుచి వస్తుంది. ఇంకా అంతేకాకుండా గాయాలు ఇంకా దెబ్బలు తాకితే మన పెద్దలు కొంత పసుపును వాటిపై  రాస్తారు.అందువల్ల అవి త్వరగా మానుతాయి. ఇలా రాయడం వల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది.ఎందుకంటే యాంటీ సెప్టిక్ గుణాలు పసుపులో ఉన్నాయి. అందుకే గాయాలు, పుండ్లు ఇన్‌ఫెక్షన్ కావు. ఇంకా యాంటీ వైరల్‌, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ గుణాలు కూడా పసుపులో ఉన్నాయి.చాలా అనారోగ్య సమస్యలను పసుపు ద్వారా మనం నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు ఇంకా కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జామ ఆకులు కొన్నింటిని అలాగే పసుపు కొంత తీసుకుని రెండింటినీ బాగా కలిపి ముద్దగా నూరి తరువాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఏర్పడే మచ్చలు మొటిమలు ఈజీగా పోతాయి.


పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే దాని వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ చాలా ఈజీగా మాయమవుతుంది.ఇంకా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది.ఒక పాత్రలో నీటిని తీసుకుని వాటిని బాగా మరగబెట్టాలి. ఇక అందులోంచి ఆవిరి బాగా వస్తున్నప్పుడు పాత్రను దించి అందులో కొంత ఉప్పు ఇంకా పసుపు వేసి వచ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో దగ్గు, జలుబు వంటివి ఈజీగా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల ఊపిరి తిత్తులు ఇంకా ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా పోతాయి. గురక ఉన్నవారు ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.అలాగే ఒక పసుపు కొమ్ము తీసుకుని దానికి వేడి నీళ్లు కలిపి ముద్దగా నూరి దీన్ని తలకు పట్టించి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తల తిరుగుడు ఈజీగా తగ్గుతుంది. వేపాకు, పసుపు రెండింటినీ సమ పాళ్లలో తీసుకుని బాగా నూరి మిశ్రమంగా చేసి దీన్ని శరీరానికి పట్టించి కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గజ్జి, తామర ఇంకా దురదలు వంటి చర్మ సమస్యలు ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: