నవయవ్వనానికి హాని కలిగించే ఆహారాలు ఇవే..!
మసాలా ఆహారాలు..
మసాలా కలిగిన ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల ముఖముపై మొటిమలు,మచ్చలు మరియు మృత కణాలు అధికమై,అందాన్ని దెబ్బతీస్తాయి.కావున మసాలా ఆహారాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం.
కూల్ డ్రింక్స్..
వేసవిలో అధికవేడిని తట్టుకోలేక చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు.కానీ వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావడమే కాక,ఇందులో ఉండే కార్బన్ డయాక్సైడ్ వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చేందుకు సహాయపడతాయి.కావున ముఖ్యంగా యవ్వనంగా కనిపించాలి అనుకునేవారు,కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడం చాలా మంచిది.
జంక్ ఫుడ్స్..
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సోడియం, మరియు చెడుకొవ్వులు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా,చర్మ సమస్యలను కలిగిస్తాయి.
ఆల్కహాల్..
అందాన్ని పోగొట్టడంలో ఆల్కహాల్ ముందుంటుందని చెప్పడం లో అతిశయోక్తి లేదు.ఆల్కహాల్ అధికంగా తీసుకునే వారిలో నీటి శాతం తగ్గిపోయి,చర్మం పేలుసుగా తయారయ్యి,తొందరగా వృద్ధాప్య ఛాయాలు వస్తాయి.మరియు లివర్ పనితీరు కూడా దెబ్బతింటుంది.
ప్రాసెస్డ్ ఫుడ్..
40 లో కూడా 20 ఇల్లా కనిపించాలి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే,అంత మంచిది.ఇందులో ఫ్రీ రాడికల్స్ అధికం చేసే గుణం ఉంటుంది.దీనితో చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.
కాఫీ, టీలు..
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల,ఇందులో ఉన్న కెఫెన్,చర్మ రంద్రాలను అధికంగా ఓపెన్ అయ్యేందుకు ఉపయోగపడి,చర్మ సమస్యలను కలిగిస్తుంది.దీనితో 20 లో 40 లా కనిపిస్తారు.కావున పైన చెప్పిన ఆహారలన్నిటికి దూరంగా ఉండి,సరైన జీవనశైలిని అవలంబించడం వల్ల,నిత్యయవ్వనంగా కనిపించవచ్చు.